ఆయుధాలు త‌యారు చేశాడు... కానీ శాంతినే కోరుకున్నాడు.. నేడు నోబెల్ జ‌యంతి

Spyder
ప్రముఖ స్వీడిష్ రసాయన శాస్త్రవేత్త, ఇంజనీరు, ఆవిష్కారకుడు, మిలిటరీ ఆయుధాల తయారీదారు మరియు డైనమైట్ ఆవిష్కారకుడు. ఒక పాత ఇనుము మరియు స్టీల్ మిల్లును తీసుకొని బొఫోర్స్ అనే మిలిటరీ ఆయుధాలను తయారు చేసే కంపెనీ స్థాపించాడు. ఈయన ఆఖరి వీలునామాలో నోబెల్ బహుమతి స్థాపన కొరకు చాలా పెద్ద మొత్తంలో ధనాన్ని కూడగట్టాడు. సైన్స్, సాహిత్యం, శాంతి విభాగాల్లో విశేష కృషిచేసిన వారికి వీటిని అందజేస్తారు , 1885లో ఆల్ ఫ్రెడ్ నోబెల్ తన వీలు నామా లో నోబెల్ శాంతి బహుమతి ఎలాంటి వారికి ఇవ్వాలో చాలా వివరంగానే ప్రస్తావించారు. కృత్రిమ మూలకము నోబెలియం ఇతని పేరు మీదుగా నామకరణం చేసారు.

ఈయన స్వీడన్ దేశంలోని స్టాక్‌హోంలో అక్టోబర్ 21 1833లో జన్మించాడు. ఆల్ఫ్రెడ్‌ తండ్రి ఇమాన్యుయెల్‌ ఇంజనీరు. తరువాత ఇతని కుటుంబంతో 1842లో సెయింట్ పీటర్స్‌బర్గ్ చేరుకున్నాడు. ఆల్ఫ్రెడ్ రసాయన శాస్త్ర అధ్యయనం ప్రొఫెసర్ నికోలాయ్ నికోలవిచ్ జినిన్ వద్ద ప్రారంభించాడు. నేడు భౌతిక, రసాయన, వైద్య, ఆర్థిక శాస్త్రాలలోనే కాకుండా... సాహిత్యం, శాంతి రంగాల్లో విశేష కృషి చేసిన వారికి అందిస్తున్న ప్రపంచ ప్రఖ్యాత నోబెల్‌ పురస్కారం ఈయన పేరుమీదన స్థాపించబడింది. ఆల్‌ఫ్రెడ్ నోబెల్‌ 1895 నాటి వీలునామా ప్రకారం 1901లో ఈ పురస్కారం ప్రారంభించబడింది. (నోబెల్‌ మరణించిన 5 సంవత్సరాల తరువాత).

ఆల్‌ఫ్రెడ్ నోబెల్‌ గౌరవార్ధం శాంతి బహుమతిని 1969 నుండి బ్యాంక్‌ ఆఫ్‌ స్వీడన్ దేశం అంద‌జేస్తోంది.  ఈ ఆరు బహుమతులు అత్యధిక పారితోషికంతో పాటు పేరు ప్రఖ్యాతలకు నిదర్శనం. ప్రతీ సంవత్సరం, ఒక్క శాంతి బహుమానం తప్ప మిగతా ఐదు బహుమతులు నోబెల్‌ వర్ధంతి అయిన డిసెంబరు 10 నాడు, స్టాక్‌హోంలో ఇవ్వబడతాయి. వివిధ రంగాలలో విశేషమైన కృషి / పరిశోధనలు చేసిన, విప్లవాత్మక విధానాలు / పరికరాలతో శాస్త్రాన్ని ముందంజ వేయించిన, మానవ సమాజానికి ఆ శాస్త్రంతో అత్యంత సహాయాన్ని అందించిన వ్యక్తులకు, సంస్థలకు (శాంతి బహుమతి మాత్రమే) ఇవ్వబడుతుంది. ప్రపంచంలో అత్యంత ప్రాముఖ్యమైన అవార్డులలో “నోబెల్ అవార్డులు” ఎంతో ప్రాముఖ్యమైనవి. డైనమైట్ కనుగొన్న అల్ఫ్రెడ్ నోబెల్ పేరు మీదుగా ప్రతి ఏటా ఈ అవార్డులను ప్రదానం చేస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: