డబ్బుంటే పావురాన్ని కుక్కగా మార్చేయొచ్చు.. తెలుసా..?

shami
ఎలన్ మస్క్ గురించి ఎవరు ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది. మొన్నటివరకు ఎలా ఉన్నా అతను ట్విట్టర్ కొన్న తర్వాత మాత్రం అతని మ్యాడ్ నెస్ ఎలాంటిదో అందరికి చూపించేస్తున్నాడు. మొన్నటివరకు ట్విట్టర్ బ్లూ టిక్ గురించి ఇష్టం వచ్చిన రూల్స్ పెట్టేసిన ఎలన్ మస్క్ లేటెస్ట్ గా ఎంతో పాపులర్ అయిన ట్విట్టర్ పిట్టని మాయం చేశాడు. అదేంటి అంటే ట్విట్టర్ లో ఇప్పుడు పావురం మాయమై దాని ప్లేస్ లో శునక మహరాజా దర్శనం ఇస్తున్నాడు.
అదేంటి అలా ఎలా జరుగుతుంది అనుకోవచ్చు. ఎలన్ మస్క్ తలచుకుంటే కాదు కాదు డబ్బు తలచుకుంటే ఏదైనా జరుగుతుంది.. ట్విట్టర్ ఆయన చేతుల్లోకి వచ్చింది అంటే అది డబ్బు వల్లే కదా.. అలా తన చేతుల్లోకి వచ్చిన ట్విట్టర్ ని తనకు ఇష్టం వచ్చినట్టుగా మార్చేస్తున్నాడు మస్క్. ఇంకేముందు ఇన్నాళ్లు తమ ట్విట్టర్ పేజ్ లో పావురాన్ని చూసిన యూజర్స్ ఇప్పుడు బొచ్చు కుక్కని చూసి షాక్ అవుతున్నారు. పాపులర్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఏమి చేయలేని పరిస్థితి.
ట్విట్టర్ ఇది కేవలం కామన్ పీపుల్ కి మాత్రమే కాదు సెలబ్రిటీస్ కి సైతం మంచి స్కోప్ ఇచ్చింది. అయితే ఇప్పుడు సెలబ్రిటీస్ ఎలన్ మస్క్ తీసుకుంటున్న చిత్ర విచిత్రమైన నిర్ణయాల వల్ల ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. ట్విట్టర్ లో పావురం బదులు కుక్కని పెట్టడం వెనక ఎలన్ మస్క్ ఆనందం ఏమిటో కానీ ఒక్కసారిగా ఈ ట్విట్టర్ అసలు మనం ఎందుకు వాడుతున్నాం అనుకున్న వారు చాలామంది ఉన్నారు. సో డబ్బుతో పావురాన్ని కుక్కగా మార్చేయొచ్చు అని ఎలన్ మస్క్ ప్రూవ్ చేశాడు. ట్విట్టర్ పేజ్ లో డాగ్ ఇమేజ్ చూసి చాలామంది విసుగెత్తిపోతున్నారు. ఇంకా రాను రాను ట్విట్టర్ లో ఎలాంటి మార్పులు ఉంటాయో అని యూజర్స్ అంతా కూడా కన్ ఫ్యూజన్ లో ఉన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: