ఆ గది లోపల జగన్.. ఏమాయ చేస్తాడో.. ఏమో..?

Chakravarthi Kalyan
ఏపీ సీఎం జగన్.. ఏం మాయ చేస్తాడో.. ఏమో.. వివిధ సమస్యల మీద చర్చల కోసం ఆయనతో చాలా మంది సమావేశం అవుతుంటారు. ఈ సమస్య పరిష్కారం చాలా కష్టం సుమా అనిపించే స్థాయిలో ఆ సమస్యలు ఉన్నా.. ఒక్కసారి జగన్‌తో సమావేశం అయిన తర్వాత.. ఆ సమస్య కోసం వచ్చిన వారు మాత్రం చిరునవ్వుతో బయటకు వస్తారు.. సమస్య పరిష్కారం అయ్యిందని చెబుతారు. సీఎం సమస్యను సానుకూలంగా పరిష్కరిచారని చెబుతుంటారు.

విచిత్రం ఏంటంటే.. ఆ సమావేశానికి వెళ్లక ముందు వారు చేసిన డిమాండ్లకు.. ఆ తర్వాత.. సీఎం దగ్గర హామీ పొందిన విషయాలకు పెద్దగా తేడా ఏమీ ఉండదు.. అరకొర సర్దుబాట్లు తప్ప.. అక్కడ జరిగింది పెద్దగా కనిపించదు. అయినా సరే.. జగన్ దగ్గరకు వెళ్లి రాగానే సమస్య పరిష్కారం అయిందని చెబుతుంటారు. ఇదంతా చూస్తే.. ఆ సీఎం జగన్ దగ్గర ఏదో మాయ ఉన్నట్టే అనిపించడం లేదు.. మరి అంతగా జగన్ ఆ గదిలో ఏం మాయ చేస్తారో ఏమో..

మొన్నటికి మొన్న ఉద్యోగులు ప్రభుత్వంపై సమర శంఖారావం పూరించారు. విజయవాడలో అదిరిపోయేలా చలో విజయవాడ సభ నిర్వహించారు. దీంతో జగన్ సర్కారు దిగొచ్చిందని అంతా భావించారు. ఆ తర్వాత ఉద్యోగ సంఘాల నాయకులు సీఎంతో చర్చలకు వచ్చారు. చర్చల తర్వాత కూడా సీఎం ఫిట్‌మెంట్‌ పెంచలేదు.. హెచ్‌ఆర్‌ఏ శ్లాబులు పూర్తిగా పునరుద్దరించలేదు.. ఇలాంటి ప్రధానమైన డిమాండ్లు ఏమీ ప్రభుత్వం అంగీకరించకపోయినా.. సమస్య పరిష్కారం అయ్యింది. సమ్మె యోచన విరమించుకున్నామని ఉద్యోగ సంఘ నేతలు చెప్పారు.

ఇక నిన్నటికి నిన్న సినిమా పెద్దలు జగన్‌ను కలిశారు.. టికెట్ల రేట్లు పెంచాలని కోరారు. పెద్ద సినిమాలకు ప్రత్యేక అనుమతులు కావాలన్నారు. ఇంకా చాలా అడిగారు. అయితే ఇంకా సినిమా టికెట్ల అంశం పూర్తిగా పరిష్కారం కాలేదు. నెలాఖరుకు జీవో వస్తుందన్నారు. ఎంత పెంచుతారన్నదానిపై క్లారిటీగా చెప్పేలదు. ఐదో ఆటకు ఓకే చెప్పారు. ఏ సినిమా అయినా ఒకటే రేటు అన్నారు. మరి ఈ మాత్రం దానికే సినిమా పెద్దలంతా అహా.. ఓహో అంటూ బయటకువచ్చారు. మరి ఇంతకీ జగన్ ఆ గదిలోపల ఏం మాయ చేస్తాడబ్బా..?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: