ట్రోలింగ్‌ పాయింట్‌: కేసీఆర్ రాజ్యాంగం ఎలా ఉంటుందో తెలుసా?

Chakravarthi Kalyan
రాజ్యాంగం.. ఒక దేశాన్ని నడిపించే పుస్తకం.. రాజ్యాంగం.. దేశానికి దిక్సూచి.. రాజ్యాంగం.. ఈ దేశం ఎలా నడుచుకోవాలో చెప్పే నిబంధనల నిఘంటువు.. రాజ్యాంగం.. మన సామాజిక స్థితికి ఓ దర్పణం.. ఒక్క మాటలో చెప్పాలంటే.. రాజ్యాంగమే దేశానికి సమస్థం. రాజ్యాంగంలో లేనిదేదీ అమలుకావడానికి వీల్లేదు.. రాజ్యంగంలో ఉన్నదేదీ ఉల్లంఘించడానికీ వీల్లేదు.. ఇది రాజ్యాంగకర్తలు ఆశించిన మార్పు. అయితే.. భారత రాజ్యాంగం విశిష్టమైంది. ఎన్నో దేశాల రాజ్యాంగాలను పరిశీలించి అంబేడ్కర్ బృందం అందించిన మహాగ్రంథం. ఇంకా చెప్పాలంటే.. ఇండియాకు భగవద్గీత, ఖురాన్, బైబిల్‌ రాజ్యాంగమే.

అయితే.. ఎప్పుడో అంబేడ్కర్ రాసిన రాజ్యాంగానికి కాలం చెల్లిందా.. ఈ దేశానికి సరికొత్త రాజ్యాంగం అవసరమా.. ఇప్పుడు ఉన్న రాజ్యాంగం అస్తవ్యస్తంగా ఉందా.. అంటే అవునంటున్నారు కేసీఆర్. ఈ దేశానికి కొత్త రాజ్యాంగం కావాలని ఆయన అన్న మాటలు రాజకీయ కలకలం సృష్టించాయి. అయితే.. మన రాజ్యాంగమేమీ మార్చలేనిది కాదు.. అది ఇప్పటికే వందకు పైగా సవరణలు పొందింది. రాజ్యాంగాన్ని సవరించుకోవడం కూడా రాజ్యాంగంలో భాగమే.

ఇక కేసీఆర్ కొత్త రాజ్యాంగం కావాలి అన్నమాటకు నెటిజన్లు విపరీతంగా స్పందిస్తున్నారు. సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ అవుతోంది. కేసీఆర్ కొత్త రాజ్యాంగం ఇలా ఉంటుందంటూ మీమ్స్, సెటైర్లు, స్ఫూఫ్‌లు తయారవుతున్నాయి. దీన్ని విపక్షాలు బాగా వాడుకుంటున్నాయి. కేసీఆర్ కొత్త రాజ్యాంగంలో నిబంధనలు ఇలా ఉంటాయని కొన్ని సెటైర్‌గా పోస్టులు పెడుతున్నారు. కేసీఆర్ రాజ్యాంగంలో ముఖ్యమంత్రి సెక్రటేరియట్‌కు రానవసరం లేదని ఉంటుందట.

కేసీఆర్‌ రాజ్యాంగంలో సీఎం ఫామ్ హౌస్‌లో ఎన్నిరోజులైనా ఉండొచ్చని ఉంటుందట. కేసీఆర్ రాజ్యాంగంలో సీఎం ఎవరినైనా ఎలాగైనా బూతులు తిట్టొచ్చని ఉంటుందట. సీఎంను మాత్రం ఎవరూ తిట్టకూడదని కూడా ఉంటుందట. ఏ భవనాన్నైనా కూల్చే అధికారం సీఎంకు ఉంటుందట కేసీఆర్ కొత్త రాజ్యాంగంలో.. సీఎం కుటుంబ సభ్యులకు ఎన్ని పదవులైనా ఇచ్చుకోవచ్చని కూడా ఉంటుందట. ఇలా  ట్రోల్‌ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: