అమిత్‌షాకు బాబు ఫోన్.. కానీ షా ఫ్లాష్‌బ్యాక్ మర్చిపోతారా..?

Chakravarthi Kalyan
టీడీపీ నేత పట్టాబి సీఎం జగన్‌పై చేసిన ఘాటు వ్యాఖ్యలు వైసీపీ శ్రేణుల ఆగ్రహానికి కారణమయ్యాయి.. అవి చివరకు రాష్ట్రంలో అరాచకానికి కారణమయ్యాయి. మా సీఎంను అంత మాట అంటారా అంటూ వైసీపీ శ్రేణులు రెచ్చిపోయాయి. అసలే అధికార పార్టీ.. అడ్డుకునేదెవరు.. అందుకేనేమో.. దాదాపు అన్ని జిల్లాల్లో టీడీపీ ఆఫీసులపై దాడులు జరిగాయి. ఏకంగా మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంపైనే దాదాపు 200 మంది వరకూ వచ్చి దాడి చేశారు. ఈ సందర్భంగా దాడుల సమాచారం కాస్త ముందే తెలుసుకున్నచంద్రబాబు డీజీపీకి ఫోన్ కూడా చేశారట. కానీ.. ఆ చంద్రబాబు ఫోన్‌ను డీజీపీ పట్టించుకోలేదట.

విషయం సీరియస్‌గా ఉందని చెప్పినా సరైన యాక్షన్ తీసుకోలేదని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు చంద్రబాబు ఏపీలో పరిస్థితి చేయి దాటి పోతోందని ఏకంగా కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు ఫోన్ చేసారు. అమిత్‌ షా మాత్రం ఫోన్‌ ఎత్తినట్టు.. మాట్లాడినట్టు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఏపీలో జరిగిన అరాచకాన్నంతా అమిత్‌షాకు వివరించిన చంద్రబాబు అర్జంటుగా ఏపీకి కేంద్ర బలగాలు పంపాలని విజ్ఞప్తి చేశారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. అంతవరకూ ఓకే.. కానీ ఆ తర్వాత ఏం జరిగింది.. చంద్రబాబు ఫోన్‌పై అమిత్‌ షా ఎలా స్పందించాడన్నది మాత్రం తెలియలేదు.

అయితే.. అమిత్‌షాకు ఏపీలో దాడులు అనగానే ఓ విషయం మాత్రం వెంటనే గుర్తొచ్చి ఉండొచ్చు. గతంలో తాను తిరుపతి వచ్చినప్పుడు.. తనపై టీడీపీ నాయకులు.. అంటే అప్పట్లో అధికారంలో ఉన్న పార్టీ శ్రేణులు చేసిన దాడి కూడా గుర్తొచ్చి ఉండొచ్చు. అవును కదా.. ఏపీలో అధికారంలో ఉన్న పార్టీ ఇలా చేయడం కామన్‌ కదా.. చంద్రబాబు గారూ.. అని ఉల్టా అడిగారో లేదో తెలియదు.. అబ్బే.. అలా కంప్లయింట్ చేస్తారేంటి చంద్రబాబు గారూ.. గతంలో మీరు కూడా నా మీద ఇలాగే రాళ్లు వేయించారు కదా. అప్పుడు ఏకంగా నేనే కేంద్రమంత్రిగా ఉన్నా.. ఏమైనా యాక్షన్ తీసుకున్నానా.. రాజకీయాల్లో ఇలాంటివి కామన్ అని చెప్పిఉంటారా.. లేక.. అవన్నీ మర్చిపోయి.. అవునా చంద్రబాబు గారూ.. జగన్ అంత దారుణం చేస్తున్నాడా..ఓకే..మేం చూస్తాంలెండి అని భరోసా ఇచ్చి ఉంటాడా.. ఏమో ఏంజరిగిందో.. లోగుట్టు పెరుమాళ్లకెరుక.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: