హెరాల్డ్ సెటైర్ : పవన్ ఆరాటమంతా దీనికోసమేనా ?

Vijaya
గడచిన రెండు మూడు రోజులుగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ గురించి మీడియాలో ఏదో రూపంలో ప్రచారం జరుగుతున్న విషయం అందరు గమనిస్తునే ఉంటారు. హఠాత్తుగా మీడియాలో పవన్ ఎందుకు సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ అయిపోయారు ? ఎందుకంటే తిరుపతి లోక్ సభ ఉపఎన్నికల్లో పోటీ చేయాలని తాపత్రయపడుతున్న జనసేన తన ఉనికిని చాటుకోవాలంటే ముందు మీడియాలో నిలబడాల్సిన అవసరం ఉంది. మరి మీడియాలో నిత్యం కనబడుతుండాలంటే దారేది ? అత్తారింటికి దారేది సినిమాలో లాగే ఇక్కడ కూడా ఏదో ఒకటి చేస్తేకానీ మీడియాలో నిలవలేరు. అందుకనే మంత్రివర్గంలో ఫైర్ బ్రాండుగా పేరున్న కొడాలినాని టార్గెట్ చేశారు. అదికూడా గుడివాడలో రోడ్డుషో పెట్టుకుని మరీ కొడాలిని టార్గెట్ చేయటం వెనుక ఇంత వ్యూహం ఉంది. కొడాలిని గుడివాడలో నిలబడి ఓ నాలుగు మాటలు అనేస్తే దాని పర్యవసానం ఎలాగుంటుందో పవన్ అంచనా వేశారు. దానికి తగ్గట్లే అవసరం లేకపోయినా, అసందర్భమైనా కొడాలిని నోటికొచ్చినట్లు మాట్లాడేశారు.




సో పవన్ అంచనా వేసినట్లుగానే మరుసటి రోజు కొడాలి రెచ్చిపోయారు. తనను పవన్ నాలుగు మాటలంటే కొడాలి పదిమాటలన్నారు. పవన్ కు కావాల్సింది కూడా సరిగ్గా ఇదే. ఏదోవిధంగా జనసేన అధినేతగా తనతో పాటు తన పార్టీ కూడా జనాల్లో చర్చ జరగాలన్నదే పవన్ టార్గెట్. తొందరలో జరగబోయే తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలకు ముందు జనసేన గురించి జనాలు చర్చించుకోవటమే పవన్ కు కావాల్సింది. ఎందుకంటే ఏదో ఓ ప్రకటన ద్వారా తిరుపతిలో బీజేపీ నేతలు హడావుడి చేస్తున్న విషయం అందరు చూస్తున్నదే. ఎందుకంటే లోక్ సభ ఉపఎన్నికలో తామే పోటీ చేయాలని కమలం నేతలు పట్టుదలగా ఉన్నారు. అందుకనే జనాల్లోకి తమపార్టీని బాగా పాపులర్ చేయటంలో భాగంగానే రాష్ట్రఅధ్యక్షుడు సోమువీర్రాజు నోటికొచ్చింది మాట్లాడేస్తున్నారు. మరి ఇటువంటి సమయంలో తాను కామ్ గా ఉంటే ఎలాగన్నదే పవన్ ఆలోచన.



వీర్రాజు లాగ ఇటు చంద్రబాబునాయుడును అటు జగన్మోహన్ రెడ్డిని ఏకకాలంలో టార్గెట్ చేసే అవకాశం లేదు పవన్ కు. పవన్ కు ఎలాగూ చంద్రబాబు తరపున ప్యాకేజీస్టార్ అనే ముద్రపడిపోయింది బలంగా. కాబట్టి తన టార్గెట్ మొత్తం జగనే. అందుకనే గుడివాడలో రోడ్డుషో పెట్టుకుని కొడాలిని టార్గెట్ చేశారు. మొత్తానికి పవన్ టార్గెట్ బాగానే వర్కవుట్ అయినట్లే అనిపిస్తోంది. ఎందుకంటే వరుసగా రెండు రోజులపాటు కొడాలినాని జనసేనాధినేతనే టార్గెట్ చేస్తు ఆరోపణలు, విమర్శలతో రెచ్చిపోయారు. ఇదే సందర్భంలో మరో మంత్రి పేర్నినాని కూడా పవన్ పై విరుచుకుపడిపోయారు. మరి ఏకకాలంలో ఇద్దరుమంత్రులు పవన్ను టార్గెట్ చేయటమంటే మాములు విషయం కాదుకదా. సో జరిగింది చూస్తుంటే పార్టీ ఉనికిని కాపాడుకోవటంలో పవన్ సక్సెస్ అయినట్లే కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: