హెరాల్డ్ సెటైర్ : ఆ ఒక్క పనిచేస్తే పవన్ గ్రేటన్నట్లే ..చేయగలుగుతాడా ?

Vijaya
 వాళ్ళని వీళ్ళని ఎంఎల్ఏలుగా రాజీనామాలు  చేయమని డిమాండ్ చేయటం చాలా ఈజీనే. మన దగ్గరకు వచ్చేసరికి ఏమి చేయాలే అన్నది ముందుగా నిర్ణయించుకోవాలి. ఆ తర్వాత ఇతరుల విషయాన్ని ఆలోచించాలి. ఇదంతా ఎవరి గురించో ఈపాటికే అర్ధమైపోయుంటుందే. అవును జనసేన అధినేత పవన్ కల్యాణ్ గురించే. మూడు రాజధానుల ప్రతిపాదనకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ సంతకాలు పెట్టిన దగ్గర నుండి రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడిక్కిపోయాయి. అధికార వైసిపి, ప్రధాన ప్రతిపక్షమైన  టిడిపినే కాదు   ఓట్లు, సీట్లు లేని ఇతర పార్టీల్లో కూడా ఇదే గోల మొదలైపోయింది. ప్రభుత్వాన్ని రద్దు చేసి తాజాగా జనాల తీర్పు కోరాలని ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబునాయుడు అండ్ కో  జగన్మోహన్ రెడ్డిని డిమాండ్ చేశాడు. అదే సమయంలో  ముందు టిడిపి ఎంఎల్ఏలనే రాజీనామాలు చేయాలని వైసిపి ఎదరుదాడి మొదలుపెట్టింది.



అధికార-ప్రతిపక్షాల రాజీనామాల గోల ఇలాగుంటే మధ్యలో అసెంబ్లీలో ఒకే సీటున్న జనసేన అధినేత పవన్ కూడా దూరేశాడు.  టిడిపి ఎంఎల్ఏలందరితో పాటు గుంటూరు, కృష్ణా జిల్లాలకు చెందిన వైసిపి ఎంఎల్ఏలు వెంటనే రాజీనామాలు చేసి ప్రజల తీర్పు కోరాలంటూ ఓ విచిత్రమైన డిమాండ్ చేశాడు.  ప్రభుత్వం చేసిన పని నచ్చకపోతే ప్రతిపక్షాల ఎంఎల్ఏలు రాజీనామాలు చేయటం మనకు తెలిసిందే. మరి అధికార పార్టీ ఎంఎల్ఏలు ఎందుకు రాజీనామాలు చేయాలి ? ఇటువంటి తలతిక్క డిమాండ్లు పవన్ ఎందుకు చేసినట్లు ? ఎందుకంటే ఆరుమాసాలు సావాసం చేస్తే వారు వీరవుతారనే సామెత అందరికీ తెలిసిందే కదా . అదే పద్దతిలో దాదాపు ఐదేళ్ళు చంద్రబాబుతో పవన్ సావాసం చేశాడు కదా అందుకనే ఇటువంటి తలతిక్క డిమాండ్లు చేసినట్లు అర్ధమైపోతోంది. పైగా అంతకుముందు చంద్రబాబు ఇటువంటి డిమాండ్ చేశాడు కాబట్టే పవన్ కూడా గుడ్డిగా  ఫాలో అయిపోయాడు.



సరే వాళ్ళని వీళ్ళని రాజీనామాలు చేయమని అడిగే బదలు ముందు ఆ రాజీనామా ఏదో తన పార్టీ నుండే మొదలుపెట్టొచ్చు కదా ? మొన్నటి ఎన్నికల్లో జనసేన తరపున రాజోలు నియోజకవర్గం నుండి రాపాక వరప్రసాద్ గెలిచాడు. పోటి చేసింది జనసేన తరపునే కానీ గెలుపులో జనసేన పాత్ర పెద్దగా లేదులేండి. ఈయన కూడా పూర్వాశ్రమంలో వైసిపి నేతే. ఆ పార్టీ నుండి పోటి చేసే అవకాశం దొరకలేదని జనసేనలో చేరి పోటి చేసి గెలిచాడు. గెలిచిన తర్వాత నుండి రాపాకు, పవన్ మధ్య ఏమి జరిగిందో ఎవరికీ తెలీదు. పార్టీ కార్యక్రమాల్లో పవన్ తన ఎంఎల్ఏను చిన్న చూపుచూడటం మొదలుపెట్టాడు. దాంతో మెల్లిగా రాపాక పార్టీకి దూరమైపోయాడు. పార్టీ కార్యక్రమాల్లో కూడా పెద్దగా కనబడటం లేదు. అందుకనే అసెంబ్లీలో కూడా స్వతంత్రంగా వ్యవహరించటం మొదలుపెట్టాడు.



ఇపుడు విషయం ఏమిటంటే ఇతర పార్టీల ఎంఎల్ఏలు రాజీనామాలు చేయాలని డిమాండ్ చేసేబదలు ముందు ఆపనేదో తన ఎంఎల్ఏతోనే మొదలుపెట్టొచ్చు కదా ?  తమ ఏకైక ఎంఎల్ఏ రాపాకతో ముందుగా రాజీనామా చేయిస్తే మిగిలిన ఎంఎల్ఏల రాజీనామాలు డిమాండ్ చేయవచ్చు.  మరి రాపాకతో పవన్ రాజీనామా చేయిస్తాడా ? అయిన కర్నూలుకు వెళ్ళినపుడు అందరికీ అమరావతే రాజధానిగా కానీ తన వరచు కర్నూలే రాజధాని అని ఒకసారి పవన్ అన్నట్లు గుర్తు. అలాగే వైజాగ్ వెళ్ళినపుడు మాట్లాడుతూ వైజాగ్ రాజధాని అయితే బాగుంటుందని ఇంకోసారి అన్నట్లు గుర్తు. ఎక్కడికెళితే అక్కడి మాటలు మాట్లాడిన పవన్ జనసేన అధినేతగా ముందు రాజీనామా చేస్తాడా ?




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: