హెరాల్డ్ సెటైర్ : ఎవరు ఎలా పోతే నీకేంటయ్యా జగన్ ...? నచ్చావ్ పో ...!

జగన్ పాలన జనరంజకం ... అబ్బో అబ్బో వచ్చిన ఆరునెలల్లోనే ఇచ్చిన దాదాపు అన్నీ హామీలు  నెరవేర్చేసాడు. ఇచ్చిన హామీలు, ఇవ్వనివి అన్నీ చేసి చూపిస్తున్నాడు. అసలు కరోనా సమయంలో ఏమి జరగబోతోంది ...? జరుగుతుంది అన్నీ ముందు చూపుతో చెప్పేసాడు. అవును జగన్ చెప్పినవన్నీ, ముందు హేళన చేసినా, తరువాత అందరూ ఒప్పుకున్నారు. సరే ఇదంతా రొటీన్ యవ్వారమే కదా ... ? రోజు చెప్పుకునే విషయమే కదా ! ఇక ఈ లాక్ డౌన్ విషయానికి వచ్చేద్దాం ! మర్చి 24 వ తేదీన దేశం మొత్తానికి తాళం వేసిపారేసిన మన ప్రధాని మోదీ గారు .. ఆ తాళం చెవి ఎక్కడో పడినట్టుగా ప్రవర్తిస్తూ లాక్ డౌన్ పెంచుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నాడు. ఇప్పటికే మూడు సార్లు పెంచారు. ఈ రోజుతో అంటే మే 17 తో లాక్ డౌన్ పూర్తి అవుతోంది. మళ్ళీ తాళం పడే అవకాశం ఉందని, కొన్ని విషయాల్లో సడలింపులు ఉన్నాయని, ఇలా పెద్ద ప్రచారమే జరుగుతోంది. 

 

ఈ సంగతి ఇలా ఉంటే వలస జీవులు మాత్రం ఈ లాక్ డౌన్ లో పెద్ద ఇబ్బందే ఎదుర్కుంటున్నారు. అష్టకష్టాలు పడుతున్నారు. ఎక్కడా ఉండలేక వలస బాట పడుతున్నారు.నడకనే నమ్ముకున్నారు. అలా నడుస్తూ నడుస్తూ చచ్చిపోయేవాళ్లు ఎంతమందో ..? ఈ కష్టాలు ఎవరికీ పట్టవా అంటూ పేపర్లలో, జనాల్లోనూ ఒకటే ఆవేదన. కొన్ని స్వచ్ఛంద సంస్థలు అయ్యో అంటూ జాలిపడుతూ, తమకు తోచిన సహాయం చేస్తున్నాయి. అయినా వేలాదిగా వలసజీవులు రోడ్లపై కనిపిస్తున్నారు. అసలే వేసవికాలం ఆపై నడక , నెత్తిపై లగేజ్ .. చంకలో పిల్లాపాపలు. ఈ బరువంతా మోస్తూ ... ఏంట్రా ఈ బతుకు అన్నట్టుగా వెళ్తున్న వారంతా లోలోపల పడుతున్న వేదన. 


ఇక్కడే మళ్లీ రియల్ హీరో తన దాతృత్వాన్ని చాటుకుంటున్నాడు. అసలు తమ రాష్ట్రం వారు కాదు. అయినా ఏపీ సీఎం జగన్ వారి బాధలు, కష్టాలను చూసి చలించాడు. గతంలో తాను పాదయాత్ర ద్వారా రాష్ట్రం మొత్తం పర్యటించిన అనుభవం ఉండడంతో నడక కష్టాలు ఎలా ఉంటాయో బాగా తెలుసు. అందుకే వారి కష్టాలను చూసి చలించి వారి కష్టాలను తీర్చేందుకు వలస కూలీలు నడిచే మార్గాల్లో భోజనం అందించే ఏర్పాట్లు చేశారు.అన్నం పెట్టడం, బస్సులు పెట్టడం, వరకు ఆలోచించాడా అంటే అక్కడితో ఆగలేదు. వాళ్లంతా ఏ రాష్ట్రం వారో... ఏ ప్రాంతం వారో, వారు రాష్ట్ర ఓటర్లు కాకపోయినా .. వారివల్ల ఉపయోగం లేకపోయినా సరే జగన్ వాళ్ల కష్టాన్ని తీర్చేందుకు నేనున్నాను అంటూ ముందుకు వచ్చాడు. 


అంతేనా మండుటెండల్లో నడిచి వెళ్తున్న వారిలో కొంతమందికి చెప్పులు కూడా లేకపోవడాన్ని గుర్తించి వారి చెప్పులు కూడా ఇవ్వాలి అనే ఆలోచన రావడమే కాదు దానిని అమలు చేసి మరీ చూపించాడు. అసలు జగన్ ను మనసున్న మహారాజు అనేది ఇందుకేనా ? అసలు ఎవరు ఎలా పోతే నాకేంటి అన్నట్టుగా వదిలెయ్యకుండా పట్టించుకుంటున్నావ్ గా జగన్ . నచ్చావ్ పో ...! 

  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: