మంచిమాట: గొప్పలకు పోతే ఎవరూ సహాయం కూడా చేయరు..!!

Divya
ఒక నావికుడు తనతో పాటు తాను ఓ కోతిని పడవలో సముద్రంలోకి తీసుకెళ్ళాడు. సరిగ్గా నీటి మధ్యకి వెళ్ళేసరికి పెద్ద తుఫాను వచ్చింది. పడవలో ఉన్న వారందరూ నీళ్లలోకి దూకి తలో దిక్కు ఈదుకుంటూ వెళ్లి ప్రాణాలు రక్షించుకున్నారు. కోతి సగం మునిగిన పడవ పై నిలబడి రక్షించండి... రక్షించండి.. అంటూ అరిచింది.
అది విన్న ఓ తిమింగలం పడవ దగ్గరికి వచ్చి కోతిని వీపుమీద ఎక్కించుకుని తీసుకెళుతోంది.
పడవలో మనుషులందరూ చక్కగా ఈదుకుంటూ వెళ్ళిపోతుంటే నువ్వు మాత్రం రక్షించండి అంటూ దిక్కులు చూస్తున్నావ్.. నీకు ఈత రాదా.. అంటూ కోతిని అడిగింది తిమింగలం. ఈత రాదని చెబితే చిన్నతనంలా ఉంటుందని భావించిన కోతి..అదేం లేదు నేను నీ కన్నా వేగంగా ఈదుకుంటూ వెళ్ళగలను అంది బడాయిగా..అలాంటప్పుడు రక్షించమని ఎందుకు
అరిచావు అని అడిగింది తిమింగలం..

నేను కోతుల్లో మహారాజుని ఏ పనైనా సేవకులతో చేయించుకోవటం తరతరాలుగా మాకు అలవాటు అని  గొప్పగా చెప్పింది. కోతి బడాయి తనం తిమింగలానికి వెంటనే అర్థమయ్యింది..ఆపదలో ఉన్నప్పుడు కూడా రాజభోగాలు కావాలంటే ఎలా? అంటూ మరో ప్రశ్న వేసింది తిమింగలం.. కోతికి కోపం ఎక్కువ అయింది.. నేను మహారాజును అని ముందే చెప్పానుగా.. నువ్వు నా  సేవకుడివి .. ప్రశ్నలు అడిగే అధికారం నీకు లేదు. అదే మా రాజ్యం లో ఇలా చేస్తే కఠినంగా శిక్షిస్తాము  కానీ ఇప్పుడు నువ్వు నాకు సహాయపడుతున్నావు కదా అందుకని ప్రేమిస్తున్నాను అంటూ చెప్పింది కోతి..

ఎవరైనా సరే ఆపదలో సహాయపడిన వారిని గౌరవించాలి అనే కనీస సంస్కారం కూడా లేని కోతి పై తిమింగలానికి బాగా కోపం వచ్చింది. నేను ఈ సముద్రం లోని చేపలకి మహారాజుని..నీలాంటి పొగరుబోతులకు. మేము శిక్షలు విధిస్తాం అంది తిమింగలంనీళ్ళలో ఉండేదానివి నువ్వేమి శిక్షలు వేస్తావు అంది కోతి వెటకారంగా..అలాగా అయితే చూడు... అంటూ కోతిని అమాంతం నీళ్లలో పడేసి వెళ్ళిపోయింది తిమింగలం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: