మంచిమాట: సర్దుకుపోవడం నేర్చుకున్నప్పుడే జీవితంలో పైకి ఎదగగలరు..!!

Divya
ఒక ఊర్లో ఒక పేదవాడు ఉన్నాడు. అతనికి ఇద్దరు భార్యలు..అతనికి ఆస్తి ఒక ఆవు తప్ప మరేమీ లేదు. కష్టం చేసి ఆవుపాలు అమ్ముకొని జీవితం గడుపుతూ ఉండేవాడు. కొంత కాలానికి అతడు అకస్మాత్తుగా చనిపోయాడు. చనిపోయేటప్పుడు ఆవును తన ఇద్దరి భార్యలలో ఎవరు తీసుకోవాలో చెప్పలేదు. అందువల్ల సవతులు ఇద్దరూ ఆవు కోసం తగువులాడుకోవటం ప్రారంభించారు. చివరికి ఇద్దరూ కలిసి ఒక మధ్యవర్తి దగ్గరకు వెళ్లి న్యాయంగా తీర్పు చెప్పమని వారు కోరారు..
ఆ మధ్యవర్తి జరిగిందంతా విని ఆవు మీ భర్త ఆస్తి కనుక దానిలో మీ ఇద్దరికీ సమాన హక్కు ఉంది! కాబట్టి ఇద్దరికీ సమాన భాగాలు రావాలి. అన్నాడు సవతులు ఇద్దరికీ ఆవును సమానంగా ఎలాగా పంచుకోవాలో అర్థం కాలేదు "స్వామి! తీర్పు చెప్పిన మీరే సమభాగాలు పంచి మా పోట్లాట తీరిస్తే మీ పేరే చెప్పు కుంటాము అని అన్నారు.
   
ఆ మధ్యవర్తి ఒప్పుకొని ఆవుని తీసుకురమ్మన్నాడు సవతు లిద్దరూ వెళ్లి ఆవును తెచ్చి మధ్యవర్తికి ఎదుట ఉంచారు. అప్పుడు మధ్యవర్తి బొగ్గుతో ఆవు మధ్యగా గీత గీసి రెండు భాగాలుగా చేసి సామాన్యంగా చిన్న వాళ్ళ ముందు ఎన్నుకోవడం న్యాయపద్ధతి! కాబట్టి నువ్వు నీఇష్టంవచ్చిన భాగం ఎన్నుకో వమ్మ అంటూ చిన్న ఆమె వైపు చూసి ఆ స్వామి చెప్పాడు. వెంటనే ఆమె పొదుగు ఉన్న వైపు ఎంచుకుంది. ఇంకా తప్పనిసరిగా పెద్ద సవతికి తల వైపు భాగం మాత్రం  తప్పలేదు. అయినా పెద్దమనిషి తీర్పుకు ఎదురు చెప్పలేక తిరిగి చిన్న సవతితో పాటు ఆమె ఇంటికి వచ్చేసింది.
మధ్యవర్తి చెప్పిన తీర్పు ప్రకారం మేత పెట్టడం పెద్ద సవతి వంతు..ఇక ఆ పాలు పిండు కోవటం చిన్న సవతి వంతు అయ్యింది. పాపం పెద్ద సవతి కి అన్యాయం జరిగింది. మేత కష్టమే కాని ఫలితం లేదు. మరొక ఉపాయం ఆలోచించి పూర్తిగా ఆవు బాధ వదిలించుకోవటమో లేక సవతితో పాటు సగ భాగం పాలతో అనుభవించడమో జరగాలను కుంటుంది. మరియొక పెద్ద మనిషి దగ్గరకు వెళ్లి జరిగిందంతా చెప్పి మరొక ఉపాయం చెప్పమని ప్రార్థించింది. కానీ అతను చెప్పకపోగా ఆమెకు నష్టాన్ని మిగిల్చారు. సర్దుకొని పోయి ఉంటే ఇద్దరికీ లాభమే..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: