మంచిమాట : మనలోని బలహీనతే శత్రువుల కు పునాది..!!

Divya
అనగనగా ఒక ఒక ఊరి చివరన ఒక పెద్ద అడవి ఉండేది.. అడవిలో పెద్ద పెద్ద కోర పన్నులతో ఒక అడవి పంది నివసిస్తూ ఉండేది. ఆహారం కోసం జంతువులను వేట డానికి ఎప్పటికప్పుడు తన కోర్కెలను మరింత పదునుగా చేసుకుంటూ ఉండేది ఆ అడవి పంది. ఇక ఎప్పటిలాగే ఒకరోజు ఆ అడవి పంది తన దంతాలను అంటే తన కోర పన్నులను చెట్టుకి గీకి వాటికి పదును చేసుకుంటోంది. ఈ విషయం అక్కడే చెట్టు మాటున దాగి ఉన్న ఒక నక్క గమనించింది.
ఆ నక్కకు  కొంచెం వెటకారం ఎక్కువ.. పక్క వాళ్ళను సూటిపోటి మాటలు అనకుండ ఎప్పుడూ ఉండలేదు. అందుకనే అడవి పందిని చూడగానే తన టైం బాగుంది అని అనుకొని అడవిపందిని తన మాటలతో  ఒక ఆట పట్టిదాము  అని అనుకుంది. పక్కన  నుంచుని అటు ఇటు చాలా ఆతృతతో ఏదో బద్ద శత్రువులు దాక్కున్నట్లు వారిని చూసి భయపడుతున్నట్లు నటించింది. అడవి పంది పట్టించుకోకుండా దాని పని అది చేసుకుంటూ వుండి పోయింది.
మొత్తానికి తన ఆటకే బోర్ కొట్టి నక్క"ఎందుకు అలా దంతాలను పదును చేసుకుంటున్నావు. నాకేమీ ఎవరు నీ మీద దాడి చేస్తున్నట్లు కనిపించట్లేదే?"అని చిరునవ్వుతో కొంచెం వెటకారంగా అడవిపందిని చూసి అడిగింది ఆ జిత్తుల మారి నక్క. అడవి పంది చాలా కూల్ గా.. ప్రశాంతంగా "ఎవరు దాడి చేశాక దంతాలను పదును పెట్టుకునేంత వీలు ఉండదు.. అయినా శత్రువులు  ముందే ఈ పదునైన కొమ్ములను చూసి నాతో గొడవ పెట్టుకోరు"అని తన పని చేసుకుంటూనే జవాబు చెప్పింది. నిజమే మనలోని బలహీనతే మన శత్రువులకు బలము.. వారికి మనలో ఏ బలహీనత కనిపించకపోతే వారు మన జోలికి రారు. ఇక విషయం తెలుసుకుని ఇక అప్పటి నుంచి తనని తాను ధైర్యం గా ఉంచుకోవడానికి ప్రయత్నం చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: