మంచిమాట : ఎవరి పని వారు చేస్తేనే మంచి ఫలితం ఉంటుంది..

Divya
తుమ్మ గూడెం అనే ఊరిలో కావమ్మ అనే ఒక అవ్వ ఉండేది. ఒంటరిగా బతుకీడుస్తున్న కావమ్మకి బీర అనే ఒక  కుక్క తోడుండేది. ఒక సారి అవ్వ అడవికి వెళ్లి కట్టె పుల్లలు తెచ్చుకుంటూ ఉండగా.. తనకు  ఒక బాతు కనిపించింది. ఒళ్లంతా రక్తస్రావమై కొన ఊపిరితో ఉన్నది ఆ బాతు. కావమ్మ దాన్ని ఎత్తుకొని గాయాలకు పసరు కూడా  రాసింది. ఆమె చికిత్సతో కోలుకున్న ఆ బాతు కావమ్మ కు ప్రతిరోజు ఏటి లోపలకెళ్లి చేపలను పట్టుకొచ్చి ఇస్తూ ఉండేది. కావమ్మ ఆ బాతుకి బూరా అని పేరు పెట్టి చాలా ముద్దుగా చూసుకునేది. దాంతో బీరా లో అసూయ పుట్టింది. ఒకరోజు కావమ్మ కొడుకు శాయన్న.. వస్తున్నాడని కబురొచ్చింది. ఇదే అదనుగా బీరా,బూరా దగ్గరకెళ్ళి రాకరాక వస్తున్న అవ్వ కొడుక్కి బాతు మాంసం అంటే చాలా ఇష్టమట..
అతని కోసమే నిన్ను చక్కగా చూసుకుంది...! అని భయపెట్టింది ఆ బాతుని..  దాంతో బూరా ఏటికి ఆవలి ఒడ్డున తల దాచుకుంది. ఇల్లు వదిలి వెళ్లిపోయిన అవ్వకి దూరమైనందుకు బాగా ఏడుస్తూనే ఉండేది. అలా ఏడుస్తూనే ఉన్న బూరానీ ఆ పక్కగా వెళ్తున్న అవ్వ  కొడుకు శాయన్న చూసి విషయమేమిటని అడిగాడు. ఆయన ఎవరో తెలియక తన కథంతా ఆయనకు  చెప్పింది. ఇంతటికీ బీరానే కారణమని శాయన్న గ్రహించాడు. అతడు ఓ ఉపాయం ఆలోచించి ఇంటికి వెళ్లగానే... బీరా కాళ్లు చేతులు తాడుతో  కట్టేసాడు. దాని ముందు ఓ కత్తి తీసి సానపెట్టడం మొదలుపెట్టాడు.
ఇదేంటని అడిగిన కావమ్మ కి నాకు గత కొంత కాలంగా కడుపు నొప్పి వస్తోందమ్మ! వైద్యుని అడిగితే ప్రతిరోజూ కుక్క రక్తం పూయమన్నాడు. అన్నాడు అది విని బీరా భయంతో పెద్దగా ఏడవటం మొదలుపెట్టింది. కాసేపు దాన్ని అలా ఏడిపించి.. బూరాని బీరా ఎలా బయ పెట్టిందో కావమ్మకు చెప్పాడు. శాయన్న చెప్పిన మాట  విని పెద్దగా నవ్వేసినా కావమ్మ.. బీరా నీ దగ్గరకు తీసుకొని శాయన్న లాగే నువ్వు బూరా కూడా నాకు పిల్లలు లాంటి వారే! అది మనకి ఆహారం తెచ్చి ఇస్తే నువ్వు కాపలా ఉంటున్నావు..కాబట్టి  ఎవరి పని వాళ్లది ఇందులో అసూయపడడానికి ఏముంది అని చెప్పి మందలించింది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: