మంచిమాట: నిజాయితీగా ఉన్నప్పుడే అందరి దగ్గర నమ్మకంగా ఉండవచ్చు..!!

Divya
శేషయ్య , భూషయ్యలు ఆ ఊరిలో ప్రముఖ వ్యాపారస్తులు. ఇద్దరి మధ్య చాలా గట్టి పోటీ ఉండేది.అయితే ఒకరోజు ఒక యువకుడు భూషయ్య వద్దకు వచ్చాడు. అప్పుడు పద్దులు రాసుకుంటున్న భూషయ్య కాసేపయ్యాక తల ఎత్తి ఎవరన్నట్లు అతనికేసి చూశాడు. "అయ్యా! నా పేరు తిరుపతి.. శేషయ్య గారి వద్ద గుమాస్తాగా పని చేసేవాడిని.. అక్కడ జీతం సరిపోక పని మానేశాను. మీ దగ్గర ఖాళీ ఉంటే నేను పని చేస్తాను"అన్నాడు.
భూషయ్య క్షణం ఆలోచించి "ఇక్కడ కొంత కాలం పని చేశాక, మళ్లీ జీతం పెంచమని అడగవన్న నమ్మకం ఏమిటి? అన్నాడు.. జీవితం సరిపోదనిపిస్తే అప్పుడు పెంచమని అడగడంలో తప్పు లేదు కదండి అన్నాడు తిరుపతి "నిన్ను పనిలోకి తీసుకుంటే నాకు ప్రత్యేకంగా లాభమేముంది?"అని అడిగాడు భూషయ్య. "మీరు అనేది నాకు అర్థం కాలేదండీ!"అన్నాడు తిరుపతి వినయంగా
"అదే... అక్కడ వ్యాపారానికి సంబంధించి ఎలా నడుస్తోంది..అలా  వగైరా విషయాలు నాకు చెప్పగలవా?"అని అడిగాడు భూషయ్య
"అది కుదరదండి. ఎందుకంటే అక్కడి రహస్యాలను మీకు చెబితే మీరు నన్ను పనిలోకి తీసుకోరు"అన్నాడు తిరుపతి. అప్పుడు  "ఎందుకని?"అంటూ భూషయ్య కాస్త మాట సాగదీశాడు.
ఇక్కడి విషయాలు మళ్లీ అక్కడ చెప్పవని నమ్మకం ఏమిటి? అని అడుగుతారు" అన్నాడు తిరుపతి.
ఆ జవాబు వింటూనే భూషయ్య పెద్దగా నవ్వి "తిరుపతి! నీ జవాబు.. నీ తెలివి తేటలను కాదు. నీ నిజాయితీని కూడా తెలియజేస్తున్నది. నాకు ఆ శేషయ్య కు వ్యాపారంలో పోటీయే కానీ గుమస్తాల విషయంలో పోటీ లేదు. రా,రా ఈ పద్దు పుస్తకం తీసుకో..అందులో నిన్ను పనిలోకి తీసుకుంటాను!"అన్నాడు.
ఎక్కడైనా సరే నిజాయితీగా పని చేయడం.. అందరితోనూ నిజాయితీపరుడు అనిపించుకోవడం.. ప్రతి ఒక్కరికి మంచి చెడులను ఆలోచించి జాగ్రత్తగా మసులుకోవడం లాంటి పనుల వల్ల మనిషి నిజాయితీ పరుడు అని అనిపించుకుంటాడు. కాబట్టి మనం కూడా జీవితంలో నిజాయితీగా ఉంటేనే అందరి నమ్మకాన్ని పొందగలుగుతాము.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: