మంచిమాట: తేనెతో దాహం తీరదు కదా..!!

Divya
కృపా నందుడు అనే జమీందారు ఉండేవాడు.. అతను మిక్కిలి ధనవంతుడు.. చాలా కాలం వరకు సంతానం కలగలేదు.. అందుకోసం ఎన్నో పూజలు , వ్రతాలు చేశాడు.. కానీ చివరకు ఎంతో కాలం తర్వాత అతనికి ఒక పుత్రుడు జన్మించాడు. ఆ బాలుడికి యశస్వి అని నామకరణం చేసి.. ఎంతో అల్లారుముద్దుగా పెంచసాగారు.

ఒకనాడు బాలుడికి అక్షరాభ్యాసం చేయాలని సంకల్పించి.. స్వర్ణ కారుడిని పిలిపించాడు.. చుట్టూ వజ్రాలు పొదిగిన అత్యంత ఖరీదైన.. నవరత్న , బంగారు లోహం తో పలక,  బలపం తయారుచేసి తీసుకురావాల్సిందిగా ఆ స్వర్ణ కారుడికి ఆదేశించాడు.
ఇక రాజు కృపా నందుడు  తెలిపి నట్టుగా స్వర్ణకారుడు దగదగ లాడి పోయే బంగారు పలక, బలపం తయారు చేసి తీసుకు వచ్చాడు..
 జమీందారు బాలుడిని అక్షరాభ్యాసానికి సిద్ధం  చేసిన పలక  మీద బంగారు బలపం తో అక్షరాభ్యాసం  చేయగా.. ఒక్క అక్షరం కూడా పడలేదు. దాంతో బాలుడు ఏడవడం మొదలుపెట్టాడు.. బాలుడి ఏడుపుని తగ్గించడం కోసం అతడిని గుర్రం బండి మీద పురవీధులలోకి తీసుకెళ్ళాడు రాజు..
ఒక చెట్టు కింద కొందరు పేద బాలులు  కూర్చుని రాతి పలక మీద సున్నపురాయి బలపం తో అక్షరాలు దిద్దుతూ చదువు కొంటున్నారు. అది చూడగానే యశస్వి తనకు కూడా అలాంటి పలకా.. బలపం కావాలని మారం చేశారు. కృపా నందుడు వెంటనే సేవకుడిని పంపి అలాంటి పలక బలపం తెప్పించాడు.
బాలుడు ఎంతో సంబరపడిపోతూ పలక మీద బలపంతో చిన్న చిన్న గీతలు గీస్తూ ఆనందించాడు. కుమారుని సంబరం చూసి జమీందారు కూడా ఎంతో సంతోషించాడు. ఆ రాతి పలక మీద సున్నపురాయి బలపం తో బాలుడికి అక్షరాలు దిద్దించాడు.కాబట్టి తేనెతో దాహం తీరదు.. ఏ  వస్తువులు ఎక్కడ కావాలో అక్కడ కావాల్సిన చోటనే వాడాలి.అప్పుడే వాటి విలువ పెరుగుతుంది అని తెలుసుకున్న రాజు అప్పటినుంచి డబ్బు వృధా చేయలేదు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: