మంచిమాట: కొన్ని సమయాలలో వివేకవంతులు కూడా అవివేకులవుతారు.

Divya
చాలా కాలం క్రితం సింధూక అనే ఒక అందమైన పక్షి కొండ కింద ఉన్న ఒక పెద్ద చెట్టు మీద నివసిస్తుండేది. అది చాలా ప్రత్యేకమైన పక్షి దాని రెట్టనేలకు తాకగానే స్వచ్ఛమైన బంగారంలా మారిపోయేది. ఒకరోజు ఒక వేటగాడు సింధుక నివసించే చెట్టు కిందకు అలసట తీర్చుకోవడానికి వచ్చాడు. నేలమీద ఉన్న బంగారు రెట్టను చూసి అతడు ఆశ్చర్యపోయాడు. వాటిని సింధూక విసర్జిస్తుందని దాని విసజ్జకాలు నేలను తాకగానే బంగారంలా మారుతున్నాయని అతడు వెంటనే తెలుసుకున్నాడు. ఇక అతడు ఏ మాత్రం సమయాన్ని వృధా చేయకుండా వలపన్ని ఆ సింధూకను పట్టుకున్నాడు. వేటగాడు ఇంటికి తిరిగి వచ్చే టప్పుడు ఈ పక్షినీ నాతో ఉంచుకోవటం చాలా అపాయకరం ఒకవేళరాజు గారికి ఈ విషయం తెలిస్తే ఈ పక్షిని నాతో ఉంచుకున్నందుకు తప్పక శిక్షిస్తాడు.

మరుసటిరోజు రాజుగారి సభకు వెళ్లి ఆ పక్షిని రాజుగారికి బహూకరించి ఆ పక్షి ప్రత్యేకతను వివరించాడు. వేటగాడి బహుమతికి సంతోషించిన మహారాజు వేటగాడిని ఘనంగా సత్కరించాడు. ఇదంతా గమనిస్తున్న ప్రధానమంత్రి మహారాజుతో ఓ మహారాజా అవివేకైనా వేటగాడి మాటల్ని మీరు ఎలా నమ్ముతారు.ఇలాంటి పక్షిని ఎవరు ఎప్పుడు ఈ రకమైన పక్షిని చూడలేదు. అని హితవుపలికాడు.అలా ఆలోచించగా తనే మోసగించుపడ్డానని భావించిన మహారాజు వెంటనే ఆ పక్షిని వదిలి పెట్టమని ఆజ్ఞ ఇచ్చాడు. ఆ పంజరం తలుపులు తెరవడం ఆలస్యం సింధుక రైయిమంటూ  పైకి ఎగిరి దగ్గరలో ఉన్న తలుపు మీద కూర్చొని రెట్ట వేసింది. అందరూ ఆశ్చర్య పోయే విధంగా తన రెట్ట నిజమైన బంగారంగా మారింది.
అక్కడి నుండి బయటపడ్డ సింధుక అలా పైకి ఎగురుతూ మొదట నేను తెలివితక్కువ దాన్ని ఆ వేటగాడు నన్ను పట్టుకోవటానికి అతనికి అవకాశం ఇచ్చాను. తరువాత నన్ను మహారాజుకి ఇచ్చేసి ఆ వేటగాడు తెలివి తక్కువ వాడయ్యాడు. ఆ తరువాత నన్ను బయటకు వదిలి పెట్టి మహారాజు ప్రధానమంత్రి తెలివితక్కువ వారయ్యారు. అని నవ్వుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: