మంచిమాట: నిజమైన స్నేహితుడి సలహా నిస్సంకోచంగా స్వీకరించాలి..!

Divya
అనగనగనగా ఒక ఊరిలో బలహీనమైన ముసలి గాడిద ఉండేది .రోజంతా ఆ గాడిద వీపు మీద పెద్ద పెద్ద మూటలు మోస్తూ ఉండేది. కానీ రాత్రి వేళకు చాకలి వాడు ఆ గాడిదను స్వేచ్ఛగా వదిలేసేవాడు. ఒక రాత్రి ఆ గాడిద అలా తిరుగుతూ ఒక గుంటనక్క ను కలవడం జరిగింది. త్వరగానే అవి మంచి స్నేహితులయ్యాయి. ఒకరోజు బాగా చీకటి పడ్డాక వాటికి పొలం నిండా బాగా పండిన దోసకాయలు కనిపించాయి. అప్పుడు అవి పొలంలోకి వెళ్లి తినగలిగినన్ని దోసకాయలు తినేసాయి. ప్రతి రాత్రి ఈ విధంగానే జరుగుతూ ఉండేది. కొంతకాలానికే ఆ గాడిద గుంటనక్క చాలా బలంగా ఆరోగ్యంగా తయారయ్యాయి.
ఒకరోజు అవి రెండు పొలం లో పడి తినటం మొదలుపెట్టగానే గాడిద ఈ రోజు నిండు పౌర్ణమి చుక్కలు కూడా మినుకు మినుకు ప్రకాశిస్తున్నాయి. ఇంత అందంగా ఉన్న వాతావరణాన్ని చూస్తుంటే నాకైతే పాట పాడాలి అనిపిస్తోంది..అంది..అప్పుడు గుంటనక్క అమ్మో  పాడద్దు కష్టాలను తెచ్చుకుంటాము. ఈ పొలం యజమాని నీ గొంతు  విన్నట్లయితే కర్రలు రాళ్లు తీసుకొని ఇక్కడికి వస్తాడు. అందులోనూ నీ గొంతు వినడానికి అంత రమ్యంగా ఉండదు. కఠోరంగా ఉంటుంది. అని గాడిదను హెచ్చరించింది.
నాకు తెలుసు నేనంటే నీకు అసూయ అని గాడిద పెద్దగా అరవటం మొదలు పెట్టింది. అపాయాన్ని ముందే పసిగట్టిన గుంటనక్క వెళ్లి దాక్కుంది. ఇంతలో రైతు కర్రలతో పొలంలోకి దూసుకొచ్చాడు. కానీ గాడిద అరవడం మాత్రం ఆపలేదు. దాంతో రైతు కర్ర తీసుకొని గాడిద వీపు మీద కొట్టడం మొదలు పెట్టాడు. అతడు చాలా గట్టిగా గాడిద కింద పడేదాకా కొడుతూనే ఉన్నాడు. చివరికి  ఒక పెద్ద రాయిని తీసుకుని గాడిద మెడలో కట్టి పడేసాడు. అప్పుడు మెల్లగా గుంటనక్క బయటకు వచ్చి నవ్వుతూ నీ శ్రావ్యమైన పాటకు రైతు మంచి పథకాన్ని బహూకరించినట్లున్నాడు. అంది..అప్పుడు  నిజంగా నీ సలహాను విననందుకు నన్ను క్షమించు అంది గాడిద..ఇక గుంటనక్క వెనకనే నడవటం మొదలు పెట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: