మంచిమాట : దురాశ దుఃఖానికి చేటు..!!

Divya
సింహపురిలో వీర్రాజు అతని భార్య.. ఇద్దరు పిల్లల్ని చదివించుకుంటూ తనకున్న మామిడి, అరటితోటలు చూసుకుంటూ వచ్చిన దానితో హాయిగా జీవితం సాగించేవాడు. ఒకరోజు వీర్రాజు స్నేహితుడు పరంధామయ్య ఇంటికొచ్చి కుశలప్రశ్నలు అనంతరం పరంధామయ్య "ఎప్పుడు ఈ పొలం పనులు చేసుకుంటూ కష్టపడుతూ ఎంతకాలం పల్లెలో ఉంటావు. నాతో చేయి కలుపు ..నీకు ఏ కష్టం లేని బతుకు, కావలసినంత డబ్బు వచ్చే వ్యాపారం నేను చూపిస్తాను అన్నాడు"వీర్రాజు అందుకు "నా ఊరు, పొలం ,ఇల్లు పిల్లలు వదిలి రావడం కుదరదు"అన్నాడు పరంధామయ్య ఆమాట ఈమాట తిప్పి వీర్రాజు ని అతని భార్య ని ఒప్పించి వస్తానని, బాగా ఆలోచించుకోమని ఏ విషయం త్వరలో చెప్పమని చెప్పగా ఒక నెల సమయం తీసుకొని చెప్తానన్నాడు. సరే... అని ఊరికి బయల్దేరాడు పరంధామయ్య.

పరంధామయ్య చెప్పిన మాటలు వీర్రాజు, అతని భార్య పైన బాగా పనిచేశాయి. ఇద్దరూ ఒక నిర్ణయానికి వచ్చి పొలాన్ని వీర్రాజు ఆ డబ్బుతో పరంధామయ్య ఇల్లు చేరాడు. ఇద్దరూ భోజనాలు అయ్యాక పరంధామయ్య "ఈ ఊరు చివర మన ఇల్లు ఒకటి ఉంది. దానిలో మన వ్యాపారం ప్రారంభిస్తాం. నీవు కుర్చీలో కూర్చుని అక్కడ పని చేసే వాళ్ళని గమనిస్తుంటే చాలు, నీ నెల జీతం నీ దగ్గరికి వస్తుంది. రేపు టౌన్ లోకి పోయి కావాల్సినంత సరుకు, కొన్ని యంత్రాన్ని తీసుకొస్తాను మన కోసం పనిచేసేవారికి నమ్మకమైన మనుషులు చాలా మంది ఉన్నారు. అని వీర్రాజుతో అన్నాడు
 పరంధామయ్య ఊరి చివర ఉన్న ఇంటికి వ్యాపారానికి సరిపడ అన్ని హంగులు సమకూర్చాడు. ఒక మంచి రోజు చూసి వ్యాపారం ప్రారంభించాడు. పనివాళ్ళ బస్తాల్లో పొడులు తీసి యంత్రాలలో వేసి కలుపుతూ బాక్సుల్లో, డబ్బాలలో నింపి సీలుచేస్తున్నారు. కుర్చీలో కూర్చుని వీర్రాజు వాళ్లు చేసే పని చూసుకుంటూ కాలం గడుపుతున్నాడు. వీర్రాజు కి నెలనెలా డబ్బు ముట్ట తోంది. రోజులు గడుస్తున్నాయి.
ఒకరోజు పట్నంలో చదువుతున్న తన ఒక్కగానొక్క కొడుకు ఆసుపత్రిలో ఉన్నట్లు త్వరగా బయల్దేరి రావాలని పరంధామయ్య కు ఫోన్ వచ్చింది. గుండె ఆగినంత పని అయింది పరంధామయ్య పరుగుపరుగున వీర్రాజు వద్దకు వచ్చి విషయం చెప్పి పట్నం పోతానని వచ్చి అన్ని వివరంగా చెప్తానని బయలుదేరి వెళ్ళిపోయాడు. ఆసుపత్రి చేరేసరికి అక్కడి దృశ్యం చూసి అవాక్కయ్యాడు. ఐసీయూలో కొడుకు, డాక్టర్లు నర్సులు ఉన్నారు. బయట పోలీసులు నిల్చుని ఉన్నారు ఇంతలో డాక్టర్ బయటకు వచ్చాడు. ఒక నర్స్ అక్కడికి వచ్చి ఇతనే అబ్బాయి తండ్రి అని పరిచయం చేసింది. డాక్టర్ ఇన్స్పెక్టర్ అతనిని డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లి అతని వివరాలు అడిగి తెలుసుకున్నారు. మీ పిల్లవాడి ఆరోగ్యం బాగా దెబ్బతింది. కల్తీ ఆహారం రోజు హోటల్స్లో తినటం వల్ల లివర్, మూత్రపిండాలు దెబ్బతిన్నాయి. కోలుకోవటం కష్టం మీరు ఎంత డబ్బు ఖర్చు పెట్టినా బతుకుతాడని నమ్మకం లేదు. "అన్నాడు డాక్టర్"ఎలాగైనా నా బిడ్డని బతికించండి. డబ్బు తెస్తాను అంటూ అక్కడి నుండి వెళ్లి పోయాడు. పరంధామయ్య ఇంటికి వెళ్లేసరికి పరంధామయ్య భార్య లబోదిబోమంటూ ఏడుస్తూ "మనం వ్యాపారం చేస్తున్న గోడముని ప్రభుత్వ అధికారులు తాళాలు వేసి కల్తీ వ్యాపారం చేస్తున్నారని మిమ్మల్ని ఇంటికి వస్తూనే పోలీస్ స్టేషన్ కు రమ్మని చెప్పి వెళ్లారండి"అని చెప్పింది. అసలే కొడుకు గురించి బాధ పడుతున్న అతనికి మూలిగే నక్కమీద తాటికాయపడిన పరిస్థితి అయ్యింది. భార్యతో కొడుకు విషయం చెప్పగానే కుప్పకూలింది. ఆమెని ఆసుపత్రిలో చేర్చి బంధువులను చూసుకోమని పోలీస్ స్టేషన్ కి వెళ్ళాడు. పోలీసులు మీరు చేసే కల్తీ వ్యాపారం వల్ల ఎంతోమంది అనారోగ్యంతో మృత్యువాత పడ్డారు.
పట్నంలోని హోటళ్లకు , మెస్ లకు మీరు చేరుస్తున్న కల్తీ సరుకుల వల్ల మీ అబ్బాయి కూడా అవి తిని ఆరోగ్యం పాడై పోయినట్లు కొద్దిసేపటి క్రితమే వార్త అందింది. అని చెప్పారు. అప్పటికీ పోలీసులు అరెస్టు చేసిన వీర్రాజు ని విచారణ జరపడం పూర్తి చేశారు. కొడుకుని పోస్టుమార్టం నిర్వహించి పరంధామయ్య చేత అంత్యక్రియలు జరిపించి అనంతరం అతన్ని జైల్లో పెట్టారు. కోర్టు విచారణలో వీర్రాజు కి కొద్దిసేపటి జరిమానా విధించి పరంధామయ్యకు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. పరంధామయ్య భార్య దిగులుతో మంచం పట్టింది. వీర్రాజు తంటాలుపడి జరిమానా కోర్టు వారికి చెల్లించి బయటపడ్డాడు. వీర్రాజు భార్య దురాశ దుఃఖానికి చేటు అని తెలుసుకుంది. పరంధామయ్య చెడపకురా చెడేవు అనుకుంటూ జైల్లో కుమిలి పోసాగాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: