మంచిమాట: ఈ ప్రపంచంలో అశాశ్వతం అందమే..!!

Divya
అనగనగా ఒక ఊరు..ఆ ఊరు చివర ఒక పెద్ద అడవి ఉండేది..ఆ అడవిలో ఒక చిన్న జింకపిల్ల కూడా ఉండేది. అయితే అది పుట్టుకతోనే తల్లిదండ్రులను దూరం చేసుకోవడం తో తన తల్లిదండ్రులు ఎలా ఉంటారో తెలియక.. ఎప్పుడూ బాధపడుతూ ఉండేది. ఇక ఒంటరిగానే పెరిగి పెద్దయి, అడవి అంతా తానే అయి సంతోషంగా తిరుగుతూ.. తనకు నచ్చిన గడ్డిని మేస్తూ ఉండేది. అయితే ఒకసారి ఎక్కువగా దప్పిక వేయడం తో ఒక కొలను దగ్గరికి వెళ్లి దాహాన్ని తీర్చుకుంటూ ఉండగా..ఆ నీటిలో ఉన్న తన నీడను చూసి ఎంతో మురిసిపోయింది ఆ జింకపిల్ల.

అయితే ఆ నీడను చూసిన ఆ జింకపిల్ల ఇలా అనుకో సాగింది.. చూడడానికి నేను ఎంత అందంగా ఉన్నాను.. అయితే ఇంత అందమైన శరీరం మీద ఈ మచ్చలు ఎందుకో.. ఇక మెలి తిరిగిన కొమ్ములతో చాలా చూడముచ్చటగా ఉన్నాను అంటూ మురిసిపోతూ.. ఇక తన కాళ్లను చూసుకొని, చీ..ఈ కాళ్లు చాలా సన్నగా ఉన్నాయి అంటూ దుఃఖిస్తూ ఉంది ఆ జింకపిల్ల.. ఇక సాయంత్రం అయ్యేసరికి తిరిగి తన స్థానానికి వెళ్లి.. విశ్రాంతి తీసుకోవడం ఆరంభించింది.. ఆ మరుసటి రోజు ఉదయం యధావిధిగా తన ఆహారం వెతుకులాట కు పచ్చిక బయలులో వెళ్ళి మేత మేస్తుండగా వేటగాడు బాగా అందంగా ఉన్న ఈ జింక పిల్లను చూసి వేటాడ పోయాడు.
ఇది గమనించిన జింకపిల్ల వెంటనే అక్కడి నుంచి చాలా వేగంగా పరిగెత్తుతూ వెళ్తుండగా.. మార్గంమధ్యలో  ఒక ముళ్లపొదల్లో దాని కొమ్ములు చిక్కుకొని పోయినవి. ఇక తన కాలి గిట్టలు నేలను కొట్టి పారిపోవాలని ప్రయత్నించినా.. ఎలాంటి ఆలోచన రాక విచారిస్తూ అక్కడే ఉండిపోయింది.. అంతలోనే అక్కడికి వచ్చిన వేటగాడు ఆ లేడీ ని పట్టుకొని తాళ్లతో కట్టి తీసుకొని పోయాడు.. చూశారు కదా..! సన్నని కాళ్ళు ప్రాణాన్ని కాపాడడానికి ప్రయత్నించినప్పటికీ, ఈ అందమైన కొమ్ములు అపాయాన్ని సృష్టించినవి.. కాబట్టి ఈ ప్రపంచంలో అందం అనేది శాశ్వతం కాదు అని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: