మంచిమాట: ఓర్పుతో ఏ పనైనా సాధించవచ్చు..

Divya
సూర్యుడు , వాయువు .. ఇద్దరూ కూడా అధిక శక్తి మంతులే.. వారిద్దరి మధ్య ఒక రోజున పెద్ద వివాదం ఏర్పడింది. వాయు కంటే నేనే శక్తి మంతున్ని అని సూర్యుడు.. సూర్యుని కంటే నేనే శక్తిమంతుడుడని వాయువు వాదిస్తున్నారు. అందుచేత వారిద్దరిలో ఎవరు బలవంతులో తేల్చుకోవాలని నిర్ణయించుకున్నారు.
ఇంతలో వారికి దుప్పటి కప్పుకొని వెళ్తున్న మనిషి ఒకరు కనిపించారు. ఆ మనిషి వంటిపై నుండి తీసివేసే లా ఎవరు చేస్తే వాళ్లు బలవంతులు అని వాయువు సూర్యు లిద్దరూ ఒప్పందం చేసుకున్నారు. ఇక అలా వాళ్ల ప్రదర్శన మొదలయ్యింది.
వాయువు తన శక్తి కొలది గట్టిగా వీచటం మొదలు పెట్టాడు. దాంతో ఆ మనిషి చలి వేసి దుప్పటిని ఇంకా దగ్గరగా గట్టిగా కప్పుకున్నాడు. వాయువు మళ్లీ చాలా ఎక్కువ శక్తితో వీచడం ప్రారంభించాడు. అంతకంతకీ ఆ మనిషి దుప్పటిని గట్టిగా కప్పు కుంటున్నాడే తప్ప తీసివేయడంలేదు. వాయువుకు ఓర్పు నశించింది. ఇక తన ప్రయత్నం మానివేశాడు.
ఇప్పుడు తన బలాన్ని ప్రదర్శించటం సూర్యుని వంతు అయ్యింది. తనకున్న శక్తినంతా కూడగట్టుకుని సూర్యుడు బాగా ప్రకాశించడం మొదలుపెట్టాడు. ఆ వేడిని ఆ మనిషి తట్టుకోలేక గాబారాపడి పోతూ పైనున్న దుప్పటిని కొంచెం వదిలి వేసి కప్పుకున్నాడు. సూర్యుడు నవ్వి సంతోషించాడు. ఆ వెంటనే కొంచెం ఎక్కువ కాంతితో ప్రకాశించడం మొదలెట్టాడు. అటుపై వేడిని భరించలేక పోయాడు. మనిషి కప్పుకున్న దుప్పటి ని తీసి మడిచి చంకలో పెట్టి నడవడం ప్రారంభించాడు. సూర్యుడు ఇంకా ప్రకాశించే సరికి ఆ మనిషి వెళ్లి ఒక చెట్టు నీడలో కూర్చున్నాడు.
ఈ విధంగా ఆ మనిషి చేత దుప్పటి తీయించి గెలుపొందాడు సూర్యుడు.. ఆ ఆనందంతో వాయువును చూసి ఒక్క నవ్వు నవ్వాడు సూర్యుడు.. ఓర్పు అనేది మనిషికే కాదు దేవుళ్ళకు కూడా ఉండాలి.. ఓర్పు తో ఎంతటి కష్టాన్ని అయినా సులభం చేయవచ్చు.. ఓర్పును కోల్పోతే మనిషి కూడా విజయాన్ని పొందలేడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: