మంచి మాట : బంధం ఉన్నప్పుడే బాధ్యత గుర్తొస్తుంది ..!

Divya
అనగనగా చిలకపాలెం అనే ఒక ఊరు వుండేది. ఆ ఊళ్లో రామయ్య, కృష్ణయ్య అనే ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. ఒకరంటే ఒకరికి అమితమైన ప్రేమ.. పెద్దయ్యేదాకా ఒకటే చోటే పెరిగారు. పెల్లిళ్లయ్యి తల్లితండ్రులు చనిపోయాక , వివిధ కారణాలవల్ల ఇష్టం లేకపోయినా సరే భార్యా పిల్లలతో వేరు వేరు కాపురాలు పెట్టుకున్నారు. ఉన్నపొలంలో చెరి సగం పంచుకొని వ్యవసాయం చేయసాగారు.

అన్నయ్య కు పిల్లలు లేరు.. రేపటి కోసం వెనకేసు కోకపోతే ఇబ్బందులు పడతాడెమో.. అనే భావనతో తన పొలం పండగానే 20 బస్తాల ధాన్యాన్ని తీసుకెళ్లి ఎవరికీ తెలియకుండా అన్న ధాన్యపు కొట్టులో పోసేవాడు కృష్ణయ్య. రామయ్యకూ తమ్ముడు అంటే అంతే ప్రేమ.. అందుకే మేము ఇద్దరమే ఉంటాం కదా.. తమ్ముడికి ముగ్గురు పిల్లలు.. వాళ్లు చేతికి వచ్చేదాకా సంసారాన్ని ఎలా ఈదు కోస్తాడో ఏమో అనుకుంటూ.. తన పంట లోంచి 20 బస్తాల వడ్లును తీసుకెళ్లి ఎవరూ చూడని సమయంలో అన్న తమ్ముడు ధాన్యం  గుమ్మిలో పోసేవాడు.

అలా ఏళ్ళు గడిచాయి. ఒకరోజు  ఒకరి ధాన్యపు కొట్టు లో మరొకరు  ధాన్యం పోయ బోతూ ఇద్దరూ ఒకరికొకరు ఎదురు పడ్డారు. అప్పటివరకూ జరుగుతున్న విషయం అంతా  తెలుసుకున్న అన్నదమ్ములిద్దరూ ఆనందాశ్చర్యాలకి గురయ్యారు.  తన తమ్ముడి గొప్పతనం గురించి అన్నా,  అన్నయ్య ప్రేమ గురించి తమ్ముడూ  ఇద్దరూ ఊళ్లో వాళ్లకు గొప్పగా  చెప్పుకోవడం  అన్నాదమ్ములు అంటే రామయ్య, కృష్ణయ్య లాగా ఉండాలి. అని చెప్పుకొనేవారు ఊరివాళ్లంతా.. ఇక అన్నదమ్ముల అనుబంధం అనేది , కేవలం మనం ఎప్పుడో ఒకసారి చదివే పుస్తకం లోనో లేక ఎక్కడో ఒక సారి చూసే తెర పైన లాగా ఉండకూడదు.

ఈ మధ్యకాలంలో కొత్త బంధం రాగానే పాత బంధుత్వాలను దూరం చేసుకుంటూ.. ఒకరికొకరు దూరంగా గడపవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. తప్పిదం ఎవరిదైనా కావచ్చు.. కానీ కలిసి ఉండడం అనేది జీవితాంతం నేర్చుకోవాలి.. అప్పుడే బంధం అనే విలువకు బాధ్యత కూడా తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: