మంచిమాట : కష్టం విలువ తెలిసిన నాడే.. మనిషి విలువ ఏంటో తెలుస్తుంది..
అంతేనా..! అనుకుంటూ బయలు దేరాడు. బంగార్రాజు ధనవంతుడైన స్నేహితుని దగ్గర అప్పు తెచ్చి ఆ మర్నాడే ఒక బంగారు నాణ్యం తెచ్చి తండ్రి చేతిలో పెట్టాడు. ఆ నాణ్యం పనికిరాదు అంటూ నదిలోకి విసిరేశాడు. ముత్యాల రాజు ఎందుకు అలా చేశాడు బంగార్రాజు కి అర్థం కాలేదు. మళ్లీ కొద్ది రోజులకు తల్లి ని అడిగి ఒక బంగారు నాణ్యం ని తెచ్చి తండ్రి చేతిలో పెట్టాడు. ఇది కూడా పనికిరాదు అంటూ నీటిలో విసిరేశాడు. తండ్రి చేసిన దానికి ఏం చేయాలో తెలియక మాట్లాడకుండా వెళ్ళిపోయాడు బంగార్రాజు.
కొద్దిరోజుల తర్వాత మళ్లీ ఒకరోజు బంగారు నాణ్యం తెచ్చి తండ్రిచేతిలో పెట్టాడు. బంగారు రాజు ఆ నాణెం ను చేతిలోకి తీసుకున్న ముత్యాల రాజు అటు ఇటు తిప్పుతూ చూసి చివరికి కి నీటిలోకి విసురుగా అని చెయ్యి ఎత్తాడు వెంటనే బంగార్రాజు తండ్రి చెయ్యి పట్టుకుని ఆగండి..విసరకండి..నేను పది రోజుల పాటు ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బుతో కొన్న నాణ్యం అని అన్నాడు. ముత్యాల రాజు నవ్వుతూ ఈ మాట కోసమే ఎదురు చూస్తున్నాను. ఇంతకుముందు నీళ్ళల్లోకి విసిరిన నాణ్యాలు నువ్వు సంపాదించింది కాదు. వాటిని పారేసిన నీకు ఏమీ అనిపించలేదు. ఇప్పుడు నీకు కష్టం అంటే ఏమిటో తెలిసింది. డబ్బు విలువ నీకు అర్థం అయ్యింది. ఇకపై నీ కాళ్ళ మీద నువ్వు నిలబడగలవు..నీ భార్య పిల్లల్ని పోషించగలవు.. ఇప్పుడు నీకు పెళ్లి చేస్తాను అని చెప్పాడు.