మంచిమాట: తండ్రి అంటే ఎలా ఉండాలో నేర్పిన ముక్కంటి..

Divya
ముక్కంటి అనగా మహాశివుడు, త్రినేత్రుడు అని రకరకాలుగా ఎవరికి వచ్చినట్టుగా భక్తులు పిలుచుకుంటూ ఉంటారు. అయితే ఈ త్రినేత్రుడు తండ్రి బాధ్యతను చక్కగా నెరవేర్చాడు. అదేమిటో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం.
పరమశివుడిని వేడుకుంటే ఎంత త్వరగా వరం ప్రసాదిస్తాడో, వినకపోతే అంతే కఠినంగా కూడా ఉంటాడు. అందుకే పరమశివుడిని ప్రసన్నం చేసుకోవడానికి, మహా మహా రాజులు కూడా ఎన్నో సంవత్సరాల పాటు తపస్సు చేసి, ఆయన మనసును గెలుచుకున్న వారు చాలా మందే ఉన్నారు. ఒకవేళ ఆ పరమశివుడి మనసుని కనుక మనం కించపరిచినట్టు అయితే ముక్కంటి కోపోద్రిక్తుడై , ప్రళయం వస్తుందని చాలామంది భయపడుతుంటారు. కానీ ఇప్పటివరకు అలాంటి సందర్భాలేవి జరగకపోయినా, కేవలం గణేశుని విషయంలో మాత్రం ముక్కంటి తన మూడో కంటిని తెరిచాడు.

ఇది పొరపాటు జరిగిందని తర్వాత తెలుసుకున్నాడు త్రినేత్రుడు. ఇంతకు గణేషుని విషయంలో మూడో కంటిని తెరవాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే..కైలాసంలో ఒకానొక సమయంలో త్రినేత్రుడు తన పనిమీద బయటకు వెళ్ళారు. ఇక ఆ  సందర్భంలో..పార్వతీదేవి స్నానానికి వెళ్లాలని నిశ్చయించుకుంది. ఇక తను స్నానానికి వెళితే ఎవరూ రాకూడదని,  ఒక చిన్న బొమ్మను చేసి, దానికి ప్రాణం పోసింది. వినాయకుడు అని కూడా నామకరణం చేసింది. ఇక వినాయకుడిని  కైలాస ద్వారం ముందు కాపలా వుంచింది. ఇక ఈ  విషయం తెలియని పరమశివుడు, తన పని ముగించుకుని కైలాసానికి వచ్చాడు. పార్వతి దేవి ఆజ్ఞ మేరకు వినాయకుడు మహాశివుని కూడా లోపలికి అనుమతించలేదు. ఇక ఆశ్చర్యపోయిన మహాశివుడు..నాకే అడ్డొస్తావా.. అంటూ గట్టిగా అరిచాడు.

అయినా వినాయకుడు వినలేదు. ఇంకా కోపంతో వినాయకుడి తల తీసేసాడు మహాశివుడు. ఇక విగతజీవిగా పడిపోయిన  వినాయకుడిని చూసి పార్వతి దేవి నిర్ఘాంతపోయింది. దుఃఖంతో తట్టుకోలేక, ఎలాగైనా వినాయకుడిని బతికించమని మహాశివుడిని వేడుకుంది. ఇక పొరపాటున జరిగిన ఈ సంఘటనను తెలుసుకున్న మహా శివుడు, ఏనుగు తల తీసుకొచ్చి వినాయకుడికి పెట్టి , తిరిగి వినాయకుడికి ప్రాణం పోసి ఆయన బాధ్యత తీర్చుకున్నాడు..

ఇలా తండ్రి, కొడుకు మీద ఉన్న బాధ్యతను చక్కగా చూపించాడు మహాశివుడు. అంతేకాదు వినాయకుడికి మొదటి పూజ పట్టం కట్టి, తను కూడా పూజ చేయాల్సి వస్తే ముందు గణేషుడికి పూజ చేసిన తర్వాత పూజ చేస్తాను అంటూ ప్రతిజ్ఞ కూడా పూనుకున్నాడు. వినాయకుడు కూడా తల్లిదండ్రులను మొదటి దైవంగా భావించి లోకానికి చాటి చెప్పాడు. ఇక తండ్రీ కొడుకుల మధ్య ఉన్న బాధ్యతల్ని చక్కగా వివరించారు వీరిద్దరు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: