మంచిమాట: అతి గర్వం అనర్ధాలకు దారి తీస్తుంది..

Divya
"అన్నీ ఉన్న ఆకు అనిగి మనిగి ఉంటుంది.. ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది.."ఈ సామెతను మన పెద్ద వాళ్ళు ఊరికే అనలేదు. సందర్భానుచితంగా అన్నమాటే.. మనిషికి అతి గర్వం ఉండకూడదు.నిజానికి మనిషి ఎప్పుడైతే గర్వపడతాడో అప్పుడు పూర్తిగా తన లో ఉన్న వ్యక్తిత్వాన్ని కోల్పోతాడు. కాబట్టి మనిషి గర్వానికి దూరంగా ఉండి, ప్రేమను గనుక ఆవహిస్తే ఈ సమాజంలో తనకు లభించే గౌరవమర్యాదలు మరెక్కడా లభించవు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే అతి గర్వం వల్ల కలిగే అనర్థం ఏమిటో ఇప్పుడు ఒక చిన్న కథ రూపంలో వినిపిస్తాము.
అనగనగా ఒక చిట్టడవిలో ఒక కాకి ఉండేది. కాకికి గర్వం బాగా ఎక్కువ. ఎందుకంటే తను అంత ఎత్తులో ఎవరు ఎగర లేరని, ఈ సమాజంలో తను మాత్రమే చాలా ఎత్తుకు ఎగరగలను అని మిడిసి పడుతూ ఉండేది. ఒకరోజు కాకి కి ఏమీ తోచక అటువైపుగా వెళ్తున్న పిచ్చుకను పిలిచి, నీకు కనీసం అందంగా కూడా ఎగరడం వచ్చినట్టు లేదే.. ఏదో పురుగు ఎగిరినట్టు ఎగురుతున్నావ్ నువ్వు అని అంది వేళాకోళంగా.. ఆ మాటలకు పిచ్చుకకు కోపం వచ్చి నేను నీ లాగా ఎగరాలనే  అవసరం లేదు.. ఎవరి సామర్థ్యం వాళ్లది అంది..
కాకి..అయితే నాతో పందెం కాసి , నీ సామర్థ్యం ఎంతో చూపించి.. నన్ను ఓడించూ.. చూద్దాం..! అని అంది.. దానికి పిచ్చుక సరే అని ఒప్పుకుంది. ఇక అక్కడున్న మిగతా చిన్న పక్షులన్నీ న్యాయనిర్ణేతగా ఉంటామన్నాయి. "ఇప్పుడు మనం ఉన్న మద్ది చెట్టు తో మొదలుపెట్టి మధ్యలో ఉన్న రావిచెట్టు తర్వాత వచ్చే జడల మరిన్ని దాటుకొని మళ్ళీ ఇక్కడికి రావాలి అని ప్రకటించాయి" న్యాయనిర్ణేతగా ఉన్న పక్షులన్నీ..
పందెం అలా మొదలైందో.. లేదో..కాకి సర్రున రావిచెట్టును దాటి మర్రిమాను లోకి దూసుకెళ్లింది. జడల మర్రి చాలా పెద్దది.. లెక్కలేనన్ని ఊడలతో చాలా దట్టంగా ఉంటుంది.. ఇక దాంతో కాకి యొక్క రెక్కలు రెండూ సన్నటి ఊడల మధ్య చిక్కుకుపోయాయి. అది బాధతో అల్లాడిపోయింది. ఇక పిచ్చుక సన్నగా, చిన్నగా ఉండడం వల్ల కొమ్మ లోకి దూరి , ఆకుల మధ్య ఖాళీ చేసుకుంటూ బయటకు వచ్చి గమ్యస్థానానికి చేరుకొని, విజేతగా నిలిచింది. ఇక కాకి బాధను చూడలేక పిచ్చుక వడ్రంగిపిట్టను . కాకిని ఆ బాధ నుంచి విడిపించమని కోరింది.
ఇక పిచ్చుక కోరిక మేరకు వడ్రంగి పిట్ట ఉడల్ని మెల్లగా తొలిచి , వాటిలో ఇరుక్కున్న కాకిని కాపాడింది. ఇక ప్రకృతి లో ఎవరూ ఎక్కువ , తక్కువ కాదని తెలుసుకున్న కాకి, మరెప్పుడు గర్వపడ్డ లేదు.. ఎవరిని తక్కువ చేసి చూడలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: