మంచి మాట: బల్లి పడినప్పుడు కలిగే అదృష్ట, దురదృష్టాలు ఏంటో తెలుసా..?
సాధారణంగా చాలా మంది బల్లి పడినప్పుడు అశుభం కలుగుతుంది అని భయపడుతూ ఉంటారు. అందరూ హడావిడిగా స్నానం చేయడం, భగవంతుడిని ప్రార్థించడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు. అయితే ఏ ప్రదేశంలో బల్లి పడితే ఎలాంటి అనర్థం జరుగుతుంది.. ఏం జరుగుతుంది.. అనే విషయాలను తెలుసుకుందాం.
బల్లి పసిపిల్లలు, ఉపనయన ,పెళ్లికాని వారి మీద బల్లి పడినప్పుడు శుభ అశుభాల ఫలితాలు వారి తల్లిదండ్రులకు కలుగుతాయి.
బల్లి పాదముల నుండి తల వరకు పైకి ఎగబ్రాకినప్పుడు అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయి. ఇక తల నుండి కాళ్ళ వరకు ప్రాకినప్పుడు కష్టాలు ఎదురవుతాయి.
బల్లి పాదాల మీద పడినప్పుడు వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. అదే కుడి అరికాలు మీద పడితే ప్రయాణం, ఎడమ అరికాలు మీద పడినప్పుడు ధనప్రాప్తి కలుగుతుంది.
కాలి మడమల వెనుక భాగమున బల్లి పడితే జైలుకు వెళ్లే ప్రమాదం కూడా ఉంది.
ఇక అదే పాదాల వెనుక భాగంలో బల్లి పడినప్పుడు సుఖం కలుగుతుంది.
పాదాల కాలివేళ్ల యందు బల్లి పడినచో సంతానమునకు హానీ కలుగుతుంది.
కుడి పాదమును వేళ్ళ మధ్యలో గానీ, వేళ్ళమీద కానీ బల్లి పడితే సిరిసంపదలు చేకూరుతాయి.
కుడి పిక్క మీద బల్లి పడినచో లాభం కలుగుతుంది. ఎడమ పిక్క మీద బల్లి పడినప్పుడు ధన నష్టం కలుగుతుంది. ఇక మడమలు, మోకాళ్లు మీద పడినప్పుడు జయం కలుగుతుంది.
కుడి తొడ మీద బల్లి పడినప్పుడు సంతాన హాని కలిగితే, తొడ మీద పడినప్పుడు సంతాన ప్రాప్తి కలుగుతుంది.
తొడ వెనుక భాగాన బల్లి పడితే విషం భయం కలుగుతుంది .అదే ముందు భాగంలో పడితే సుఖం కలుగుతుంది. ఒకవేళ లోపలి భాగంలో పడితే స్త్రీ సౌఖ్యం కలుగును.
కుడి పిరుదు మీద బల్లి పడినప్పుడు సౌఖ్యం కలిగితే, ఎడమ పిరుదు మీద పడినప్పుడు ధనలాభం కలుగుతుంది.
మోకాలు మీద పడినప్పుడు కీడు కలుగుతుంది. గోళ్ళ మీద పడినప్పుడు హాని కలుగుతుంది.