మంచిమాట : చెప్పుడు మాటలు విని చెడిపోకూడదు..

Divya

చెప్పుడు మాటలు వినడం వల్ల ఎలాంటి అనర్ధాలు జరుగుతాయో అన్న విషయానికి ఇప్పుడు వివరణ తెలుసుకుందాం.
ఒక ఊరిలో ఒక రైతు నివసిస్తూ ఉండేవాడు. ఆయన ఒకరోజు తన కుమారునితో కలిసి బజారుకు వెళ్లారు. ఇక అంతా తిరిగినా వాళ్ళకు నచ్చిన వస్తువు ఏదీ దొరకలేదు. ఇక అంతా తిరిగి చిట్టచివరకు గుర్రాల వద్దకు వెళ్ళారు. అక్కడ ఒక నల్ల గుర్రం ఆ రైతుకు బాగా నచ్చింది. ఇక కొడుకు కూడా ఒప్పుకున్న తర్వాత వారు ఆ గుర్రాన్ని కొనుగోలు చేశారు. ఇక దానితో పాటుగా కొద్ది దూరం నడిచే సరికి వాళ్ళకు బాగా నీరసం వచ్చింది. అందుచేతనే వాళ్ళు గుర్రం మీద ఎక్కి ఇంటి బాట పట్టారు. దారిలో వాళ్లను చూసిన కొందరు ఆహా ఎంత చక్కగా స్వారీ చెస్తున్నారు. కానీ ఆ గుర్రం ఎందుకో బాగా నీరస పడిపోయింది అంటూ మాట్లాడుకోసాగారు.

అంతేకాదు పోతుల్లాంటి ఇద్దరు మనుషులను ఆ గుర్రం మోయలేకపోతోంది పాపం! అని అనుకుంటూ ఉంటారు. ఇక ఆ మాటలు విన్న తండ్రి కొడుకులు ఇద్దరూ సిగ్గుపడి తండ్రి కిందకు దిగి కొడుకుని మాత్రమే గుర్రం మీద కూర్చోబెట్టి, వారితో పాటు అతనూ నడవసాగాడు. మధ్యలో వారు ఒక బజారు గుండా నడవాల్సి వచ్చింది. అక్కడి జనం వీళ్ళను చూసి కొడుకు ఎంత దుర్మార్గుడు.. ముసలి తండ్రి అయినా, ఆయనను నడిపిస్తూ అతడు మాత్రం గుర్రం మీద హాయిగా కూర్చున్నాడు అంటూ పెదవి విరవడం మొదలు పెట్టారు. వెంటనే కొడుకు కిందకు దిగి తండ్రిని గుర్రం మీద కూర్చోబెట్టాడు.

ఇక ఊరి చివర ఒక చెరువు దగ్గరకు వచ్చేసరికి అక్కడ కొంతమంది ఆడవాళ్లు కూర్చుని ఉన్నారు. వీరిని చూసిన వాళ్ళు  తండ్రి ఎంత దుర్మార్గుడు.. పాపం చిన్న కొడుకు అని చూడకుండా మండుటెండలో నడిపిస్తున్నాడు.. అంటూ వాళ్లు అనడం మొదలు పెట్టారు. ఇక వారి మాటలు విన్న తండ్రి కూడా గుర్రం దిగి వారితో పాటు నడవసాగాడు. వాళ్లకు గుర్రంతో చాలా అవమానం కలిగి ఎట్లాగైనా వదిలించుకోవాలని అనుకున్నారు.
అలా  ముందుకు వెళ్తుండగా వారు ఒక నది వంతెనను దాటి వలసి వచ్చింది. ఇక వంతెన రాగానే ఇద్దరూ కలిసి గుర్రాన్ని నదిలో తోసేసారు. అది పూర్తిగా మునిగి పోయిన తర్వాత హమ్మయ్య!పీడ వదిలిపోయింది. అనుకుంటూ ఇద్దరూ హాయిగా ఇంటికి చేరుకున్నారు. గుర్రం పీడ వదిలిన సంతోషంలో వారికి డబ్బు పోయిన బాధ కూడా కలవలేదు. కాబట్టి ఇతరుల మాటలు ఎప్పటికైనా మనకు హాని కలిగిస్తాయి. కాబట్టి వినకుండా ఉంటేనే మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: