మంచిమాట: మానవ సేవే.. మాధవ సేవ..!

Divya

ఈ కాలంలో చాలామంది నీది, నాది అంటూ  తారతమ్యాలు చూపిస్తూ, మనిషికి.. మనిషికి.. మధ్య దూరాన్ని ఎక్కువగా చూపిస్తున్నారు. ఎవరికి ఎవరు సొంతము అనేది ఎవరికీ తెలియదు. కానీ బ్రతికున్నంత కాలం భగవంతుని స్మరిస్తూ జీవితం గడపడమే ఉత్తమం.. పుట్టుక మనకు  తెలియకుండానే జరుగుతుంది. అలాగే మృత్యువును ఆపడం మన చేత కాదు.. ఇలా అనుకోకుండా జరిగిన ఒక మృత్యు సంఘటన ఉదాహరణగా తీసుకొని ఇప్పుడు నేను ఒక కథ చెప్తాను .. ఆ కథేమిటో మీరు కూడా ఒకసారి చదివి ,అందులో దాగి వున్న అర్థం ఏంటో తెలుసుకొని జీవించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం..
ఒక మనిషి చనిపోయాడు. దేహంలోంచి ఆత్మ బయటకు వచ్చి ,చుట్టూ చూసింది . చేతిలో పెట్టి తో దేవుడు తన దగ్గరకు వచ్చాడు. ఇక దేవుడికి , చనిపోయిన ఆ వ్యక్తికి మధ్య సంభాషణ ఇలా సాగింది..
దేవుడు: మానవా..!  నీ శరీరం పడిపోయింది. ఇక నీ జన్మ ముగిసింది. నాతో పద.
మనిషి: అయ్యో స్వామి..!  ఇంత త్వరగానా. నేను భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కన్నాను..
దేవుడు: తప్పదు నాయనా..!  నీవు నాతో రావాల్సిన సమయం వచ్చేసింది . పదా నాతో పాటు
మనిషి : ఏది నా కోసం తెచ్చిన ఆ పెట్టే  ఇటు ఇవ్వండి ఏం తెచ్చారో చూస్తాను.
దేవుడు: నీకు చెందినవి ఉన్నాయి.
మనిషి: నావ అంటే ..? నా బట్టలు, డబ్బులు, భూమి పత్రాలు అవేగా..
దేవుడు: అవి ఎప్పటికీ నీకు కావు నాయనా.. అవన్నీ భూమివే అక్కడే ఉంటాయి.
మనిషి: పోనీ నా జ్ఞాపకాలు ఏమైనా ఉన్నాయా దానిలో.
దేవుడు: లేదు జ్ఞాపకాలు అనేవి కాలానికి చెందినవి అవి కాలగర్భంలోకి వెళ్లి పోతాయి.
మనిషి: అయితే నా ప్రతిభ ప్రజ్ఞ ఉండి ఉంటాయి..
దేవుడు: అవి పరిస్థితులవి నీవు కావు.
మనిషి : పోనీ నా స్నేహితులు ఉన్నారా అందులో.
దేవుడు: వారు నీతో కేవలం కొద్ది దూరం వరకు మాత్రమే కలిసి వచ్చే తోటి ప్రయాణికులు.
మనిషి: పోనీ నా భార్య, బిడ్డలు ఏమైనా ఉన్నారా..?
దేవుడు: వారు నీతో కలిసి ఒక నాటకం లో పాల్గొన్న పాత్రధారులు.
మనిషి: అయితే మీ వద్ద ఉన్న పెట్టెలో నా శరీరం ఉండాలి..!
దేవుడు : తప్పు నీ శరీరం ధూళి కి  చెందినది మట్టి లో పడిపోయింది.
మనిషి : స్వామి అయితే నా ఆత్మ ఉందా ..? అందులో
దేవుడు : ఆత్మ నీది ఎలా అవుతుంది.. అది నాది
మనిషి : ఆ పెట్టే  ఇటివ్వు స్వామి అని తీసుకొని తెరచి చూస్తాను. తెరచి చేరగానే కళ్ళల్లో నీళ్ళు  తిరిగాయి. ఆ పెట్టె ఖాళీగా ఉంది. మనిషి కాలం చేస్తే తనతో తీసుకు వచ్చేది ఏమీ ఉండదు అని చెప్పేందుకు, దేవుడు ఈ ఖాళీ పెట్టెను తెచ్చాడని అర్థమైంది. బతికున్నంతకాలం నా వాళ్ళు,అది నాది  అని ఆశతో ,ఆరాటంతో పరుగులు పెడుతూ పరమాత్మను మరిచాను అని దుఃఖించాడు.
స్వామి చివరిగా అడుగుతున్నాను.. నాది అనేది ఏమైనా ఉందా అసలు..
దేవుడు:  ఉంది నీవు జీవించినంత కాలం ప్రతి క్షణం నీదే.. ఆ క్షణాల్లో నీవు ఆర్జించే మంచి చెడు యొక్క పర్యవసానాలు కూడా నీకే చెందుతాయి .అందుకే ప్రతి ఒక్క క్షణం మంచిని పంచాలి . భగవన్నామస్మరణం చేయాలి. పశ్చాత్తాప వ్యక్తులను క్షమించగలగాలి  అని తోటి వారి నుంచి మనకు సంక్రమించే చెడును విసర్జించాలి.  మానవసేవే మాధవ సేవ లను గుర్తించి జీవించాలి .అని చెప్పి దేవుడు అక్కడి  నుండి వెళ్ళిపో యాడు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: