మంచిమాట : కలసి ఉంటే కలదు సుఖం..

Divya

పూర్వకాలంలో ప్రతి ఒక్కరు కలసి మెలసి ఆనందంగా జీవించే వారు. ఇప్పట్లో అయితే చిన్న తరహా ఫ్యామిలీ లకే పరిమితం అవుతున్నారు. కానీ అప్పట్లో చాలా ఉమ్మడి కుటుంబాలు ఎన్నో ఉండేటివి.  ఉమ్మడి కుటుంబాల్లో ఉన్నన్ని  సంబంధాలు చిన్న కుటుంబాల్లో ఉండేవి కాదు.. ఉమ్మడి కుటుంబాలలో ఉన్న పెద్దలు ఆలోచనలతోనే ఆ కుటుంబాలు  నడిచేవి. అందుకే ఉమ్మడి కుటుంబాలలో ఉన్న వాళ్లందరికీ ఎటువంటి భేదాభిప్రాయాలు ఉండేవి కాదు. ఒక ఇంటిపెద్ద ఎలా చెప్తే అలా నడుచుకునే వారు. ఇంటి పెద్ద మాటను ఎవరూ తీసేసేవారు కాదు. పెద్దల మాట పెరుగన్నం మూట అన్నట్టుగా వ్యవహరించేవారు ఆ కాలంలో..
కానీ ప్రభుత్వాలు కుటుంబ నియంత్రణ చట్టాలను తీసుకు వచ్చిన తర్వాత, కేవలం ఒక బిడ్డ లేదా ఇద్దరు పిల్లలకు మాత్రమే పరిమితం అవుతున్నారు తల్లిదండ్రులు . ఇక అంతే కాకుండా ఇటీవల కాలంలో పిల్లలు పోషించాలంటే మాత్రం చాలా కష్టంతో కూడుకున్న పని .ఎందుకంటే వారికి ఉన్నత చదువులు తల్లిదండ్రులుచదివించాలి అన్న ఆలోచనతో ఇప్పటి నుంచే శ్రమ పడిపోతుంటారు తల్లిదండ్రులు. అయితే కార్పొరేషన్ స్కూల్ వచ్చిన తర్వాత చిన్న పిల్లలకు ఎక్కువ  శాతం లక్షల్లో ఫీజులు వసూలు చేస్తూ సామాన్య ప్రజలకు నిరాశ గా మిగిలిపోయాయి ఈ స్కూల్స్..

ఇక ఇదంతా పక్కన పెడితే చిన్న కుటుంబాలలో ఉమ్మడి కుటుంబాల్లో ఉన్నంత ఆనందం, సంతోషం ఉండదు. ఎందుకంటే ఏ కష్టం వచ్చినా కేవలం ఆ నలుగురి మధ్యలో మాత్రమే ఉంటుంది .అయితే ఉమ్మడి కుటుంబాలు ఉండే ఇళ్లల్లో ఎలాంటి కష్టం వచ్చినా, సుఖం వచ్చిన ఆనందంగా పంచుకుంటారు. ఇక మరీ ముఖ్యంగా పండుగ సమయాలలో ఎంత ఆనందంగా అయితే గడుపుతారో ఇక మామూలు రోజులలో కూడా అంతే ఆనందంగా హడావిడిగా సందడిగా గడుపుతూ ఉంటారు.

ఇక ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉమ్మడి కుటుంబాలు అంటే కుదరదు,  కాబట్టి వీలైనంత వరకు ప్రతి ఒక్కరి తో ఆనందంగా, సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడే కలిసి ఉంటేనే మనకు సుఖం దొరుకుతుంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: