మంచి మాట : సాకులు చెప్పడం నేర్చిన వారు.. ఇంకేమీ నేర్చుకోలేరు..

Divya

ఎప్పటికప్పడు వినూత్నమైన ఆలోచనలతో, సరికొత్త మంచి మాటలను మీకు అందిస్తూ, మీలో మార్పును తీసుకు రావడం కోసం ఇండియా హెరాల్డ్ ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటుంది. అందులో భాగంగానే మీ కోసం ఒక మంచి మాటను మీ ముందుకు తీసుకువచ్చింది. అదేమిటంటే సాకులు చెప్పడం నేర్చిన వారు.. ఇంకేమీ నేర్చుకోలేరు.. దీని వివరణ ఏమిటంటే.. ఏదైనా ఒక పనిని అప్పగించినప్పుడు సాకులు చెబుతూ ఎప్పటికప్పుడు తప్పించుకునే వారు జీవితంలో ఏమీ సాధించలేరు అని అర్థం..

నిజమే కదా.. సాకులు చెబుతూ ఎప్పటికప్పుడు తప్పించుకుంటూ పోతే జీవితంలో ఏది సాధించలేరు.. అంతే కాకుండా ఏదైనా కొత్త విషయాన్ని నేర్చుకోవాలనే తపన కూడా వారిలో ఉండదు. ఫలితంగా ఏమీ తెలియని అమాయకలు లాగా మారిపోతారు. లోకజ్ఞానం కూడా తెలియని పరిస్థితికి చేరుకుంటారు..ఏదైనా పనులు చెప్పినప్పుడు ఎందుకు తప్పించుకోవాలి. శ్రమపడితే తప్పేముంది.. అది రెక్కల కష్టమైనా సరే.. ఇంకా ఏదైనా సరే..

కష్టపడితేనే ఫలితం ఉంటుంది. ప్రతి చిన్న విషయానికి  ఏదో ఒక కారణం చెబుతూ పోతే అదే అలవాటుగా మారిపోయింది. జీవితంలో ఏది సాధించలేరు. కనీసం వారి పనులు వారు చేసుకోలేని స్థితికి చేరుకుంటారు. ప్రస్తుతం మనం ఎదుర్కొనే స్థితిగతులు ఎలాంటివైనా, ధైర్యంగా నిలబడి ఆ పరిస్థితులను ఎదుర్కొనే శక్తి మనలో కలగాలి. అప్పుడే అనుకున్నది సాధించగలుగుతారు..

ప్రస్తుత కాలంలో చాలా మంది అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించుకుంటూ పనులు చేయడానికి బద్దకిస్తున్నారు. ఎప్పుడైతే మన శరీరానికి పూర్తిస్థాయిలో విశ్రాంతి ఇస్తామో, కొద్దిరోజుల తర్వాత మన శరీరం కూడా మన మాట వినకుండా అయిపోతుంది. ఇక ఏ పనీ స్వతహాగా చేయాలేము . ప్రతి చిన్న పనికి పక్కవారి మీద ఆధారపడాల్సి వస్తుంది. కాబట్టి ఏదైనా పని లేదా సహాయం అడిగినప్పుడు సాధ్యమైనంత వరకూ చేయడానికి ప్రయత్నించాలి. అంతేకానీ సాకులు చెప్పుకుంటూ పోతే జీవితంలో ఏది సాధించలేరు అలాగే ఏది నేర్చుకోలేరు కూడా..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: