మంచి మాట : మాట చాలా పదునైనది.. జాగ్రత్త సుమా..!

Divya

ఎప్పటికప్పుడు సరికొత్త మంచి మాటలతో ఎప్పుడూ మీ ముందుకు వస్తూ ఉంటుంది ఇండియా హెరాల్డ్.. ఎప్పటిలాగే ఈ రోజు కూడా ఒక మంచి పదునైన మాటను మీకోసం మీ ముందుకు తీసుకు వచ్చింది. అదేమిటంటే.. మాట చాలా పదునైనది.. మాటకు ఉన్న పవర్ దేనికి లేదు.. మనం మాట్లాడే ప్రతి మాట చాలా పదునుగా ఉంటుంది.. అని దీని అర్థం..

ఏదైనా ఒక మాట మాట్లాడేటప్పుడు,అది ఎదుటి వారిని నొప్పించేలా ఉండకూడదు.  అలాగే మనం మాట్లాడే మాట ఏదైనా సరే ఎదుటివాళ్ళని ఆనంద పెట్టాలే తప్పా కించపరిచేలా ఉండకూడదు. ఎందుకంటే మాట అనేది ఇతరుల మనోభావాలను దెబ్బ తీస్తుంది అని గుర్తుపెట్టుకోవాలి.. అంతేకాకుండా ఈ మాటల వల్ల ఒక్కోసారి ప్రాణాలు కూడా పోతూ ఉంటాయి.. కొంతమంది  సెన్సిటివ్ నేచర్ కలిగి ఉంటారు. అలాంటి వారి దగ్గర చాలా జాగ్రత్తగా మాట్లాడాలి.. ఒక వేళ కాదని ఏమైనా ఎక్కువగా మాట్లాడామనుకో వారు చాలా డిప్రెషన్కి గురవుతారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి..

అలాగే మాటకున్న పవర్ ఏమిటంటే ఇచ్చిన మాట తప్పకూడదు అనే ధర్మాన్ని ప్రతి ఒక్కరూ పాటించాలి.. ఏదైనా ఒక పని మనకు సాధ్యమైతే అవుతుంది అని చెప్పాలి.. లేదంటే మౌనంగా ఉండడం చాలా ఉత్తమం. మాట్లాడాల్సిన చోట మాట్లాడాలి.. మౌనంగా ఉండాల్సిన చోట మౌనంగా ఉండాలి. అప్పుడే మనకు సమాజంలో గౌరవ మర్యాదలు ఉంటాయి.. అనవసరంగా ఎక్కువ మాట్లాడి మన విలువలు పోగొట్టుకోకూడదు..

మనం మాట్లాడే ప్రతి మాట ప్రతి ఒక్కరికి కనువిప్పు అయ్యేలా ఉండాలి. ఎదుటి వారికి ధైర్యాన్ని నింపాలి. ప్రతి మాట సత్యమై ఉండాలి. అప్పుడే నలుగురు మిత్రులు బంధువులు  అవుతారు. మనం మాట్లాడే మాట వల్ల శత్రువులు కూడా మిత్రులు అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ. కాబట్టి మనం మాట్లాడే ప్రతి మాట ఆచితూచి మాట్లాడుతూ, ఎదుటివారిని ఇబ్బంది పెట్టకుండా ఉండేలా చూసుకోవాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: