" మంచి మాట " : ఆరోగ్యం లేని వ్యక్తి జీవితంలో ఏమీ సాధించలేరు..

Divya
ఆరోగ్యమే మహాభాగ్యం అనే సామెతను మనం రోజూ ఎక్కడో ఒక చోట చూస్తూనే ఉంటాం.. అలాగే వింటూనే ఉంటాం.. అంటే ఆరోగ్యంగా ఉండడం అనేది చాలా అవసరం.. మనం నూరేళ్ళ పాటు హాయిగా జీవించాలంటే మనం ఆరోగ్యంగా ఉండాలి. అప్పుడే మనం నూరేళ్ల పాటు హాయిగా జీవిస్తాము.. అంతేకాదు ఆరోగ్యంగా ఉంటే మనం ఏది సాధించాలనుకున్నా కూడా సాధించగల శక్తి వస్తుంది.. అయితే ముఖ్యంగా  ఆరోగ్యం లేని వ్యక్తి జీవితంలో ఏమీ సాధించలేరు అనే మాట మాత్రం వాస్తవం..

ఉదాహరణకు మనం ఏదైనా సాధించాలని అనుకున్నప్పుడు అందుకు తగ్గట్టు, మన చుట్టూ ఉన్న పరిస్థితులతో పాటు మన ఆరోగ్యం కూడా మనకు సహకరించాలి..  అప్పుడే మనం అనుకున్న దానిని సాధించగలుగుతాము. ఒకవేళ ఆరోగ్యంగా లేనప్పుడు, అనారోగ్యం మనల్ని బాధిస్తూ ఉంటే, ఏం సాధించాలన్నా కూడా సాధించలేని పరిస్థితి ఏర్పడుతుంది. మనం ముందుగా ఆరోగ్యంగా ఉండాలి అంటే ప్రతిరోజూ తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి.

పోషకాలు, విటమిన్లు కలిగిన ఆహారం తీసుకుంటూ ఉండాలి.. అలాగే ఒకేసారి కడుపునిండా తినకుండా, రోజుకు నాలుగు సార్లు అయినా సరే కొద్ది కొద్దిగా తింటూ ఉండాలి.  అంతే కాకుండా ప్రతిరోజూ వ్యాయామాలు, యోగా ఆసనాలు, ఎక్సర్ సైజులు అలాగే రోజుకు 30 నిమిషాల పాటు వాకింగ్ లాంటివి చేస్తూ ఉండాలి. సమతుల్య ఆహారం కలిగిన ఆహారాన్ని తీసుకుంటూ ఉండాలి. అలాగే నిత్యం తాజా కాయగూరలు,పండ్లు, రోజుకు సరిపడా 5 నుంచి 6 లీటర్ల నీరు తాగాలి.

అప్పుడే మనం ఆరోగ్యంగా వుండగలుగుతాము. ఎక్కువగా ఇంగ్లీష్ మందులకు అలవాటు పడకుండా, శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎప్పుడైతే మనం ఆరోగ్యంగా ఉంటామో, అప్పుడే మనం అనుకున్న పనులను సవ్యంగా చేయగలుగుతాము.  అయితే మనం ఆరోగ్యంగా లేనప్పుడు ఏ పని సవ్యంగా చేయలేము అలాగే దేనిని సాధించలేము అనే విషయాన్ని మాత్రం తప్పకుండా గుర్తుంచుకోవాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: