మంచి మాట : అడుసు తొక్కనేలా.. కాలు కడుగనేలా..

Divya

సాధారణంగా మనలో చాలా మంది సందర్భాన్ని బట్టి మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఒకానొక సందర్భంలో ఏదో ఒక సామెతను తప్పకుండా మాట్లాడాల్సి వస్తుంది. అంటే ఆ పదం మాట్లాడే ప్రతి సారి ఆ సందర్భానికి అనుగుణంగా ఉండడం గమనార్హం. " అడుసు తొక్కనేలా.. కాలు కడుగనేలా.." నిజానికి దీని అర్థం బురదలో  కాలు వేయడం ఎందుకు.. ఆ కాలుని కడగడం ఎందుకు అని దీని అర్థం వస్తుంది..

కానీ దీని వివరణ మాత్రం ఏదైనా ఒక సందర్భంలో  ఎవరైనా అనుకోకుండా ఏదైనా అపరాధము చేసినప్పుడు, ఆ అపరాధాన్ని అడుసు తో పోల్చుకుంటే,ఆ అపరాధము చేయడం ఎందుకు మరి దాని పరిష్కారం కోసం వెతుకులాడటం ఎందుకు అని మన పెద్దవాళ్ళు అంటుంటారు.
అలాగే ఇంకొక సందర్భాన్ని తీసుకున్నప్పుడు, ఏదేని ఒక సమస్యకు పరిష్కారం  చెప్పవలసి వచ్చినప్పుడు ముందుగా ఆ సమస్యకు పరిష్కారం ఏంటో మనకు తెలిసి ఉండాలి. లేదా ఒకరి ని అడిగి తెలుసుకోవాలి. ఒకవేళ ఎటువంటి ఆలోచన చేయకుండా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడి, తరువాత ఆ మాటను వెనక్కి తీసుకోవాలంటే మాత్రం చాలా కష్టమవుతుంది. ఇప్పుడు మాట ఇచ్చేటప్పుడు అయినా సరే లేదా ఎవరికైనా సలహా ఇచ్చినప్పుడు అయినా సరే ఆచితూచి అడుగు వేయాలి అని అంటారు. అలాంటప్పుడు ఈ సామెతను ముఖ్యంగా వాడటం విశేషం.
కాబట్టి ఏ వ్యక్తి తో ఆయన మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి. అంతేకాదు నిక్కచ్చితంగా ఉండాలి. తప్పులు చేసేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. పెద్దల  సమాధానాన్ని స్వీకరించాలి. ఏదైనా ఒక విషయాన్ని పరిగణించాలి అంటే మాత్రం ఒకటికి రెండుసార్లు ఆలోచించి చేయడం ఉత్తమం. ఇలాంటి పనులు చేయడం వల్ల ఎలాంటి అనర్థాలు జరగవు. కాబట్టి నేటి మంచి మాట గా అడుసు తొక్కనేలా.. కాలు కడుగనేలా.. అనే సామెతను తరచు ఉపయోగిస్తుంటారు.అందరితోనూ మంచిగా మెలగాలి

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: