మంచిమాట: మౌనంగా ఉన్నప్పుడు మంచి ఆలోచనలు వస్తాయి!

Durga Writes

నేటి మంచిమాట.. మౌనంగా ఉన్నప్పుడు మంచి ఆలోచనలు వస్తాయ్! కొందరు ఉంటారు.. ఎప్పుడు చూడు లొడలొడా మాట్లాడుతూనే ఉంటారు. అలా మాట్లాడటం వల్ల నోరు నొప్పెడుతుంది తప్ప ఏమి ఉపయోగం ఉండదు. అంతే కాదు అలా ఎప్పుడు మాట్లాడే వారి మాటలు పక్కన పెట్టేస్తారు. అసలు పట్టించుకోరు. 

 

 

ఎప్పుడు మౌనంగా ఉండి అప్పుడప్పుడు మాత్రమే మాట్లాడే వారి సలహాలకు, వారి ఆలోచనలకే ఎక్కువ విలువనిస్తారు. అందుకే ఎప్పుడు మాట్లాడుతూ ఉండకూడదు.. ఆలా మాట్లాడేవాడు ఏదైనా చెప్పాలి అని ప్రయత్నించినా.. అతని మాటలు ఎందుకు అని సలహాలు చెప్పే ముందే నువ్వు ఉండవయ్యా అని నోరు మూపిస్తారు. 

 

 

అంతేకాదు.. మన మౌనంకు ఎంతో విలువ ఉంటుంది. మనం కూడా ఎక్కువ శాతం మౌనంగా ఉండేందుకు ప్రయత్నించాలి. మౌనంగా ఉంటే ధ్యానం చేస్తూ ఉంటే భవిష్యత్తుపై మనకు మంచి ఆలోచనలు వచ్చి ఎలా ఉండాలి? ఏం చెయ్యాలి అనేవి తెలుస్తాయి. మంచి ఆలోచనలు వస్తాయి ఆనందంగా ఉంటాము. 

 

 

అదే ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతూ అందరిని విసిగిస్తూ ఉండే కంటే కూడా మౌనంగా ఉండడం మంచిది. మౌనం మనిషిని ఎక్కడికో తీసుకెళ్తుంది. చెప్పేది వింటూ సైలెంట్ గా ఉండాలి. వాళ్ళు సలహాలు అడిగినప్పుడు మనం నోరు తెరిచి వారికీ సలహాలు ఇవ్వాలి. అప్పుడే మన జీవితం అందంగా ఆనందమగా ఉంటుంది.                                                     

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: