జ‌గ‌న్ ఈ ' ఊర‌మాస్ సుభాష్‌ ' ను వదులుకుని పెద్ద త‌ప్పే చేశాడా...?

RAMAKRISHNA S.S.
( గోదావ‌రి - ఇండియా హెరాల్డ్ )
వాసంశెట్టి సుభాష్ అబ్బ‌బ్బా తిరుగులేని ఫుల్ యంగ్ మాస్ లీడ‌ర్ అని చెప్పాలి. నిజంగా జ‌గ‌న్ ఇత‌డిలో టాలెంట్‌ను గుర్తించ లేదో.. లేదా వాడుకోవ‌డం తెలియ‌లేదో గాని అన‌వ‌స‌రంగా వ‌దులుకుని త‌ప్పు చేశానే అని భ‌విష్య‌త్తులో ఫీల్ అయ్యే సంద‌ర్భం అయితే రాక‌మాన‌దు. ఏపీలో అంబేద్క‌ర్ కోన‌సీమ జిల్లా యువ‌జ‌న నాయ‌కుడు సుభాష్‌.. బీసీల్లో బ‌ల‌మైన శెట్టిబ‌లిజ సామాజిక వ‌ర్గానికి చెందిన యువ‌నేత‌. అస‌లు మాస్ అనే ప‌దానికి స‌రైన నిర్వ‌చ‌నం.. మాస్‌కే మామా.. మాస్ లాంటోడు సుభాష్‌.

సుభాష్ పేరు చెపితే చాలు కోన‌సీమ‌లో యువ‌త వారు ఏ కులం, మ‌తం అయినా స‌రే ప్రాణం ఇచ్చేస్తారు. ఓ భ‌యంక‌ర‌మైన మాస్ లీడ‌ర్‌గా చాలా త‌క్కువ టైంలోనే సుభాష్ అక్క‌డ పాపుల‌ర్ అయ్యారు. వైసీపీ యువ‌జ‌న నేత‌గా అమ‌లాపురం ప‌ట్ట‌ణంలో కీ రోల్ పోషించిన సుభాష్‌.. ఆ త‌ర్వాత సొంత పార్టీ నేత‌లు పెడుతోన్న ఇబ్బందుల నేప‌థ్యంలో ఆ పార్టీకి రాజీనామా చేసేశారు. మ‌రీ ముఖ్య‌మంత్రి అమ‌లాపురం ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి పినిపే విశ్వ‌రూప్ తీరుతో అక్క‌డ వైసీపీకి చాలా న‌ష్టం జ‌రిగింద‌న్న విమ‌ర్శ‌లు ఉన్నాయి. అస‌లు విశ్వ‌రూప్‌కు సీటే ఇవ్వ‌వ‌ద్ద‌ని సుభాష్ ప‌ట్టుబట్టే వ‌ర‌కు ప‌రిస్థితి వెళ్లింది.

అంత‌కు ముందు కోనసీమ జిల్లా పేరు మార్పు విషయంలో జరిగిన అల్లర్ల కేసులో తన సామాజిక వర్గాన్ని ప్రభుత్వం ఇబ్బందికి గురి చేసిందని సుభాష్ ఆవేదన వ్యక్తం చేశారు. అమాయకులపై కేసులు ఎత్తివేయాలని కోరగా వైసీపీ జిల్లా అధ్యక్షుడు, స్థానిక నేతలు అడ్డుపడ్డారని ఆరోపించారు. సుమారు పది సంవత్సరాల పైగా వైసీపీకి తాను ఎంతో సేవ చేశానని సుభాష్ ఎంతో బాధ‌ప‌డి.. ఆ త‌ర్వాత పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చారు. నిజం చెప్పాలంటే వైసీపీ అధినేత జ‌గ‌న్ సైతం సుభాష్‌ను వ‌దులుకునే విష‌యంలో త‌ప్పు చేశారేమో అని కోన‌సీమ‌లో చాలా మంది వైసీపీ వాళ్లే చ‌ర్చించుకుంటూ ఉంటారు.

భ‌విష్య‌త్తులో అయినా కోన‌సీమ‌లో మాత్ర‌మే కాకుండా... శెట్టిబ‌లిజ సామాజిక వ‌ర్గంలో ఓ బ‌ల‌మైన నేత‌ను కోల్పోయామ‌నే ఫీలింగ్ జ‌గ‌న్‌కే వ‌స్తుంద‌ని.. సుభాష్ రేంజ్ అద‌ని కూడా చాలా మంది అంటూ ఉంటారు. వైసీపీ అలా వ‌దులుకుందో లేదో వెంట‌నే సుభాష్ టీడీపీ కండువా క‌ప్పుకోవ‌డం రామ‌చంద్రాపురం ఎమ్మెల్యే టిక్కెట్ రావ‌డం.. మ‌నోడి క్రేజ్ అమాంతం పెరిగిపోవ‌డం చ‌క‌చ‌కా జ‌రిగిపోయాయి. ఏదేమైనా టీడీపీలో ఓ బ‌ల‌మైన యూత్ ఐకాన్ లీడ‌ర్‌గా సుభాష్ ఎదుగుతాడు అన‌డంలో ఎలాంటి సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: