మంచి మాట : ఎగిరే గాలిపటం విద్యార్థి అయితే, ఆధారమైన దారం గురువు..!

Edari Rama Krishna

- చేయబోయే పని గురించి తెలుసుకోవడం వివేకం ,ఎలా చేయాలో తెలుసుకోవడం నైపుణ్యం, తెలుసుకొని పూర్తి చెయ్యడమే సామర్ధ్యం.



- నువ్వు విజయం సాధించినప్పుడు చప్పట్లు కొట్టే పది వేళ్ళ కంటే,నువ్వు కనీళ్ళుపెట్టినప్పుడు తుడిచే ఒక్క వేలు గొప్పది.



- ఒక వ్యక్తిని త్వరగా అర్ధం చేసుకోకపోయినా ఫర్వాలేదు, కానీ అతిత్వరగా అపార్ధం మాత్రం చేసుకోవద్దు.


- అవసరమైన దానికంటె ఎక్కువ విషయాలు సేకరించేవారు. తెలుసుకున్న దాని కంటె తక్కువ మాట్లాడేవారు విజ్ఞులు.



- అందరూ నిన్నొదిలి పోతున్నప్పుడు అందర్నీ వదిలి నీ కోసం వచ్చేవాడే నిజమైన స్నేహితుడు.



- ప్రతి ఒక్కరు ఎదుటివాళ్ళని మార్చాలని చూస్తారు తప్ప, తమని తాము మార్చుకోవాలని అనుకోరు.



- మమకారం నీకు తోడును తెస్తుంది,అహంకారం నిన్ను ఒంటరిని చేస్తుంది,అందుకే ప్రతి ఒక్కరు అహంకారాన్ని వీడి మమకారాన్ని పెంచుకోవాలి.



- తెలియక చేస్తే పొరపాటు.. తెలిసి చేస్తే తప్పు.. తప్పని తెలిసి కూడా దిద్దుకోకపోతే అది నేరం.



- అజ్ఞానులు గతాన్ని, బుద్ధిమంతులు వర్తమానాన్ని, మూర్ఘులు భవిష్యత్తును మాట్లాడతారు.



- తోటి వారందరిలోకి ప్రధములుగా ఉండాలని కోరుకోవడంలో,అందుకై ప్రయత్నించడం లో తప్పు లేదు.కానీ అలా ఉండకపోవడం తో మీ జీవితానికి విలువే లేదనుకోవడం పొరపాటు.



- ఒకసారి వద్దని చెప్పిన తరువాత ఎదుటివారి బలవంతానికి ఎట్టి పరిస్థితులలోనూ లొంగిపోవద్దు.మీరు మొదట  వ్యక్తపరిచిన అభిప్రాయాన్నే తిరిగి వెల్లడించండి.ధృడంగా వ్యవహరించడం అలవాటుగా మారాలి.



- నాన్నకి ప్రేమను ఎలా చూపించాలో తెలియదు..అమ్మకి ప్రేమను ఎలా దాచుకోవాలో తెలియదు కానీ ప్రేమించడం మాత్రమే తెలుసు.. వాళ్ళు ఏమి చేసినా అది నీ మంచి కోరే చేస్తారు .కాబట్టి అమ్మ మనస్సు,నాన్న మనస్సు తెలుసుకొని మెలగండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: