మంచి మాట : పెద్దలు చెప్పిన మాటలు పాటిస్తే గొప్ప మేలు!
ఓటమి ఎరుగని వ్యక్తిని అనిపించుకోవడం కన్నా, విలువలను వదులుకోని వ్యక్తిని అనిపించుకోవడం నాకు చాలా ఇష్టం" అన్నాడు ఓ మహావ్యక్తి.అతనే ఐన్ స్టీన్.
మనం సాధారణంగా గెలుపు మీదనే శ్రధ్ధ పెడతాము, గెలిచామా లేదా అనేది మనకు ముఖ్యం కాని ఎలా గెలిచామనేది సాధారణంగా పట్టించుకోము. ఐన్ స్టీన్ చెబుతున్నది మాత్రం అది కాదు. ఓటమి ఎదురైనా ఫరవాలేదు విలువలకు మాత్రం ఎక్కడా లోతు రాకూడదని ఆయన అన్నాడు. మహాత్మ గాంధి కూడ అదే అన్నారు సిధ్ధి కన్న సాధనలు ముఖ్యం. ఏం సాధించావు అనేదాని కన్నా ఎలా సాధించావన్నది ముఖ్యమని బాపూజీ అభిప్రాయం. ఘోరంగా ఓడిపోయునా పరవాలేదు కాని అడ్డదారులు మాత్రం తొక్కరాదు అని నా అభిప్రాయం.
మనం తెలుసుకోవాల్సిన కొన్ని మంచి మాటలు :
- సలహా అనేది ఎవరికి అత్యవసరమో, వారికే రుచించదు.
- తనను తాను సంస్కరించుకున్న వ్యక్తి కె ఇతరులను సంస్కరించే అధికారం అందుతుంది.
- మన సంతోషం మన తెలివితేట పై అధారపడి వుంతుంది.
- .కఠోర పరిశ్రమ అనంతరం వరించే విజయం తియ్యగా వుంతుంది.
- .థైర్యసాహసాలు, ప్రతిభ - ఇవి ప్రతి మానవుడి విజయసాధనకు సోపానాలు.
- వైఫల్యం నిరాశకు కారణం కాకుడదు. కొత్తప్రేరణకు పునాది కావాలి.
- నిరాడంబరత స్నేహితుల్ని పెంచుతుంది.గర్వం శత్రువుల్ని పెంచుతుంది.
- సత్యమార్గంలో నడిచేవాడేసంపన్నుడు.
- ఆనందాన్ని మించిన అందాన్నిచ్హే సౌందర్యసాధనం మరొకటి లేదు.
- దుహ్ఖం అనేది శిక్ష కదు.సంతొషం అనేది వరమూ కదు. రెండూ ఫలితాలే .
- స్వర్గాన్ని నరకంగా చేసేది, నరకాన్ని స్వర్గంగా చేసేదీ మన మనసే.
- బాథ్యతానిర్వహణలో మనిషిలో శౌర్యం వెలికివస్తుంది.
- మనం ఎంత ప్రశాంతంగా ఉంటే, మన పని అంత ఉత్తమంగావుంటుంది.
- మనిషి జీవితంలో ముందడుగు వేయడానికి రెండు కారణాలు-ఒకటి భయం, రెండు శ్రద్ధ.
- అజ్ఞానం భిన్నత్వానికి, జ్ఞానం అభిన్నత్వానికి దారి చూపుతుంది.