మంచిమాట: మనిషి పతనానికైనా, పాపానికైనా కారణం భయమే!

Durga Writes

నేటి మంచి మాట.. మనిషి పతనానికైనా, పాపానికైనా కారణం భయమే! స్వామి వివేకానంద ఎంత బాగా చెప్పారో కదా.. అవును చాలా అద్భుతంగా అందంగా చెప్పారు వివేకానంద.. ఎన్నో మంచి వ్యాఖ్యలు చెప్పిన స్వామి వివేకానంద ఈ వ్యాక్యం కూడా ఆయనే చెప్పాడు.. అవును మరి నిజమే ఇది.. 

 

 

మనిషి తప్పు చెయ్యడానికి కారణం ఏంటి ? భయమే.. ఎవరో ఏదో అంటారు అని.. చేసిన మంచిని దాచి చేదు మార్గంలో నడుస్తుంటారు.. ఇంకా అలాగే ఏదైనా సమస్య వస్తుంది అన్నప్పుడు ముందడుగు వేసి ఆ సమస్యే లేకుండా చేసుకుంటే జీవితం అద్భుతంగా ఉంటుంది.. కానీ అలా ఎవరు ఉన్నారు.. సమస్య వచ్చింది అంటే చాలు వెనకడుగు వేస్తారు. 

 

 

అందుకే ఆ భయంతో చెయ్యాలి అనుకున్నది చెయ్యరు.. చేస్తే భవిష్యత్తులో ఏలాంటి సమస్య వస్తుందో.. మనం రూపాయి రూపాయి కూడబెట్టిన డబ్బు అంత కూడా ఒక్కసారిగా ఏదానిపైన అయినా పోస్తే ఎన్ని సమస్యలు వస్తాయో అనే భయంతో వెనకడుగు వేస్తారు.. సమస్యలు కొని తెచ్చుకుంటారు.. 

 

 

అందుకే అంటుంటారు.. మనిషి పతనానికైనా.. పాపానికైనా కారణం భయమే అని.. అందుకే భయం అనేది వదిలితే జీవితం ఎంతో అందంగా.. ఆనందంగా ఉంటుంది. అలా కాదు అని చేసే ప్రతి పనిలో ఏదో భయం పెట్టుకుంటే నిన్ను ఎవరు కాపాడలేరు.. ఇందులో ఏలాంటి సందేహం లేదు.. కాబట్టి భయం వదిలేస్తే జీవితాన్ని ఆనందంగా గడుపుతావు.. భయపడితే జీవితంలో ఏది సాధించలేవు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: