మంచిమాట: చిరిగిన చొక్కా అయినా తొడుక్కో కాని ఒక మంచి పుస్తకం కొనుక్కో
నేటి మంచిమాట.. చిరిగిన చొక్కా అయినా తొడుక్కో కాని ఒక మంచి పుస్తకం కొనుక్కో. అవునా ? కదా? అవును అనే చెప్పాలి. ఎందుకంటే ఓ మంచి పుస్తకం వందమంది స్నేహితులతో సమానం.. పుట్టినప్పటి నుండి పుస్తకాలు పట్టుకొనే మనం పెరుగుతాం.. ప్రతి పుస్తకము ఒక అద్భుత జ్ఞానమే.. అలాంటి పుస్తకం కొనడం కోసం ఇప్పుడు రచయతలు అంత అప్పట్లో ఎంతో కష్టపడ్డారు.
కందుకూరి వీరేశలింగం గారు చెప్పిన ఈ మంచి మాట నిజం.. చిరిగి చొక్కా తొడుక్కున్న సమస్య లేదు కానీ.. మంచి పుస్తకం కొనకుంటే మాత్రం అలాగే అజ్ఞానిలా ఉంటావు అని.. పుస్తకాలు చదవడం ఎంతో మంచిది అని.. నీ జ్ఞానానికి మెరుగు పెట్టినట్టే అని అయన చెప్పుకొచ్చారు. పుస్తకాలు చదవడం అలవాటు చేసుకుంటే జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారు అని మన పెద్దలు అంటుంటారు..
అంతేకాదు.. ఒక మంచి పుస్తకాన్ని మొదటిసారి చదివితే ఒక కొత్త స్నేహితుడిని పొందినట్టుంటుంది. మళ్లీ మళ్లీ చదివితే పాత్త స్నేహితుల్ని కలిసిన ఆనందం వేస్తుంది అని ఓ గొప్ప రచయత చెప్పారు.. ఈరోజు ఓ మంచి పుస్తకం గురించి ఎందుకు చెప్తున్నానో తెలుసా? నేడు ప్రపంచ పుస్తక దినోత్సవం.. రచయ శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి జననం.. రచయత విలియం షేక్ స్పియర్ మరణించిన రోజు.