మంచిమాట: గెలుపు అందరికి దొరకదు.. కానీ అందరిలో 'గెలిచే శక్తి' ఉంటుంది!

Durga Writes

నేటి మంచిమాట.. గెలుపు అందరికి దొరకదు.. కానీ అందరిలో 'గెలిచే శక్తి' ఉంటుంది... అవును.. ఇది నిజం.. ప్రతి ఒక్కరికి గెలిచే శక్తి ఉంటుంది. కానీ చాలామంది దాన్ని వినియోగించుకోరు.. అయితే గెలిచే శక్తి మాత్రం ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ ప్రయత్నించే లోపంలోనే.. మీరు గెలవాలా? వద్ద అన్నది ఆధారపడి ఉంటుంది. అయితే చాలామంది అనుకుంటారు గెలుపు మనకు సాధ్యం అయ్యేనా ? అని!

 

కానీ నిజానికి.. అందరికి గెలిచే శక్తి ఉంటుంది.. కానీ కొందరే ఆ శక్తిని వినియోగించుకొని గెలుపుని సొంతం చేసుకుంటారు. ఇంకా దీనికి ఉదాహరణే.. తాబేలు.. కుందేలు కథ.. తాబేలు మెల్లగా నడుస్తుంది.. దాని నడకే అంత.. కానీ కుందేలు.. చాలా వేగంగా పరిగెత్తుతుంది. అలాంటి కుందులేకు తాబేలుకు పోటీ పెట్టడమే తప్పు.. కానీ పోటీ జరిగింది. 

 

ఆ పోటీలో ఎవరు ఊహించని విధంగా తాబేలు గెలుస్తుంది. కారణం తాబేలు తన శక్తిని చూపించింది. తాబేలు.. కుందేలు పోటీ ప్రారంభమైంది.. ఆ పోటీలో మొదట కుందేలు అనుకున్నట్టుగానే వేగంగా పరిగెత్తింది.. వెనక్కు తిరిగి చూస్తే తాబేలు కనుచూపు మేరలో కూడా కనిపించలేదు.. దీంతో ఆ కుందేలు అలసిపోయి ఓ చెట్టు కింద చల్లటి గాలిలో నిద్రపోయింది. తాబేలు మెల్లగా వచ్చిన చివరికి విజయాన్ని సాధించింది. నిద్ర కుందేలు ఏమో ఘోర అవమానాలపాలైంది. అంటే ఇంకా మీరే చూడండి.. గెలిచే శక్తి ప్రతి ఒక్కరిలో ఉంటుంది.. ఆ శక్తిని సరైన సమయంలో వినియోగించినవారే గెలుపుని సొంతం చేసుకుంటారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: