మంచిమాట: జీవితంలో సంతృప్తిపడటం నేర్చుకున్న వారు ఎప్పుడు ఆనందంగా ఉండగలుగుతారు
మనం అందంగా ఉండాలంటే ఏం చెయ్యాలి ? అసలు దుఃఖం ఎప్పుడు వస్తుంది ? ఎందుకు వస్తుంది ? అంటే సమాధానం ఒక్కటే.. నీకు ఉన్న దాంతో నువ్వు సంతృప్తిగా ఉండటం నేర్చుకో.. ఆటోమేటిక్ నీకు ఆనందం అనేది దాసి అవుతుంది. ఆలా కాదు అని ఆశతో అత్యాశతో నీకు దొరకని దాని కోసం ఎదురు చూశావు అంటే.. నీ అంత మూర్కుడు మరొకడు ఉండడు.
ఇంకా అసలు విషయానికి వస్తే.. ఏ మానవుడు అయినా.. తన దగ్గర ఉన్న దాంతో సంతృప్తి పడితే జీవితం ఆనందంగా ఉంటుంది. కానీ అది మానవుడి లక్షణం కాదు కదా.. ఎంత ఉన్న సరే ఇంకా ఇంకా కావాలి అని అనుకుంటుంటారు.. అది మానవుడి సహజ లక్షణం. పోయేటప్పుడు వేసుకున్న బట్టలు కూడా తీసుకుపోలేం అని.. ఎన్నో ఏళ్ళు తినిపెంచిన శరీరాన్ని కూడా ఏమైనా చేసుకోండి అని వదిలేసి వెళుతం అని తెలుసు.. అయినప్పటికీ ఎందుకో మనుషులు శరీరంపైనా.. ఆస్తిపైన మమకారం పెంచుకుంటారు.
ఉన్నదానితో సంతృప్తి పడరు.. దొరకని దాని కోసం అత్రా పడుతారు.. ఆలా ఆత్రపడిన సమయంలోనే ఎన్నో కష్టాలు పడుతారు.. ఎంతో ఆవేశ పడుతారు.. బాధపడుతారు.. తీరా అది సంపాదించక అయినా మన శాంతిగా నవ్వుతార అంటే ? లేదు. మనశాంతి అనేది కరువు అవుతుంది. అందుకే మనశాంతి కోసం అయినా సరే ఉన్నదానితో సంతృప్తి పడితే మంచిది.