మంచిమాట: డబ్బు విలువ ఎన్నటికీ తగ్గదు..!!

Divya
కళింగ పట్టణంలో రామస్వామి అనే సముద్ర వ్యాపారి ఉండేవాడు. అతడు దేశాల్లో విలువైన వస్తువులన్నీ కొనితెచ్చి అమ్మేవాడు. ఓసారి అత్యంత విలువైన వస్తువుతో వస్తున్న అతడి పడవ తీరం చేరకముందే తుఫాను ప్రమాదం లో కొట్టుకుపోయింది దాంతో అతడికి తీవ్ర నష్టం కలిగింది. సరుపు పోవటంతో పాటు కొంతమంది పనివాళ్ళు చనిపోయారు. వారి కుటుంబాన్ని ఆదుకోవడానికి తన డబ్బంతటినీ ఇచ్చేశాడు రామస్వామి చివరకి అతడి చేతిలో చిల్లి గవ్వ కూడా లేకుండాపోయింది.
 
మనుగడ కోసం ఓ విదేశీ వ్యాపారి దగ్గర సహాయకుడిగా చేరాడు రామస్వామి. అలా పనిచేస్తూనే సొమ్ము కూడబెట్టి సొంత వ్యాపారం ప్రారంభించాడు. కష్టించి పని చేస్తాడని మంచిగా ఉంటాడని రామస్వామిని ఆ దేశంలో అందరూ గౌరవించేవారు. తమ వాడిగానే భావించేవారు.
కొన్నాళ్ళ తరువాత ఓ పండగ రోజున రామస్వామికి సొంత ఊరు వెళ్లి తన వాళ్లను కలుసుకోవాలనిపించింది. అవకాశం ఉంటే అక్కడికి తన వ్యాపార కేంద్రాన్ని మార్చుదామనుకున్నాడు. సహాయకుల్ని తీసుకొని కళింగ పట్టణానికి బయలుదేరాడు. పడవలో మూడు రోజులు ప్రయాణించటం వల్ల నిద్ర సరిగా పోలేదు ఆహారం సకాలంలో తీసుకోలేదు. వేసుకున్న బట్టలు మాసిపోయాయి మురికి బట్టలోనే రామస్వామి అతడి సహాయకులు కళింగపట్నం చేరుకున్నారు.

ఆ సమయానికి అక్కడివారంతా పండగ హడావిడిలో ఉన్నారు. రామస్వామిని అందరూ చూస్తున్నా ఎవరు పలకరించలేదు. వారి తీరుకి ఆశ్చర్యపోయాడు రామస్వామి అతడిని ఆ దుస్తుల్లో చూసి రామస్వామి ఇంకా కష్టాల్లో ఉన్నాడని భావించాడు. ఊరి వారంతా రామస్వామిని అతడి సహాయకుల్ని ఇంటికి పిలిస్తే ఏ సహాయం అడుగుతాడో ఏమో అనుకొని ఎవరి పనుల్లో వారు మునిగిపోయారు.రామస్వామికి నెమ్మదిగా పరిస్థితి అర్థం అయ్యింది కాసేపటికి తాను తెచ్చిన సంచుల్లోనీ విలువైన బంగారు ఆభరణాలను బయటకు తీశాడు.

వాటిని గమనించి ఒక్కొక్కరూ అతడి దగ్గరికి రావడం మొదలుపెట్టారు. అన్నా, కొడుకా తమ్ముడు... అంటూ మాట కలపటానికి ప్రయత్నించారు.తనను కాకుండా తన దగ్గరి డబ్బుకు విలువ ఇస్తున్నారని అర్థం చేసుకున్న రామస్వామి... మా ఊరిలో ఉండే కంటే తననెంతో గౌరవించే విదేశంలోనే వ్యాపారం చేయటం ఉత్తమం అనుకొని తన సహాయకులతో సహా మళ్లీ ఆ దీవికి వెళ్ళిపోయాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: