మంచిమాట: చెప్పులను ఎక్కువకాలం వినియోగిస్తే.. ఇటువంటివే జరుగుతాయా..?

Divya
ప్రతి ఒక్కరికి కలిగే సందేహం ఏమిటంటే, చెప్పులకు . మనకు వచ్చే కష్టాలకు సంబంధం ఏమిటి ?అని.. అయితే కచ్చితంగా సంబంధం ఉందని అంటున్నారు నిపుణులు.. ముఖ్యంగా పాత చెప్పులను ఎక్కువకాలం వినియోగిస్తే , తప్పకుండా సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని కూడా హెచ్చరిస్తున్నారు . అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇటీవల కాలంలో చెప్పులను కూడా  కొంత ప్రాముఖ్యత ఉందనే  చెప్పవచ్చు. ఎందుకంటే అమ్మాయిలు అయినా,  అబ్బాయిలు అయినా సరే సందర్భాన్ని బట్టి, సమయాన్ని బట్టి రకరకాల చెప్పులు వేసుకుంటూ ఉంటారు. అందుకు తగ్గట్టుగానే రకరకాల డిజైన్లను, కలర్లను చూసి మరీ కొనుగోలు చేస్తూ ఉంటారు. ఇకపోతే మరికొంతమంది షూస్ ని ఉపయోగించడం అలవాటు చేసుకున్నారు. అంతేకాదు సీజన్ ని బట్టి కూడా మన వాళ్లు చెప్పులు, షూస్ మారుస్తున్నారు అంటే అది అతిశయోక్తి కాదు. ఇక ఒక్కో సమయంలో ఒక్కో చెప్పులను వాడుతూ ట్రెండీగా తయారవుతూ ఉంటారు..

అయితే చెప్పులకు కూడా ఎక్స్పైరీ డేట్ ఉంటుందని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి.. ఏంటి..?  చెప్పులకి కూడా ఎక్స్పైరీ డేట్ ఉంటుందా..? ఏంటి.. జోకా ..? అని మీరు కూడా మీ భావాలను వ్యక్త పరుస్తున్నారు.. నిజమేనండి..!  చెప్పులకు కూడా ఎక్స్పైరీ డేట్ ఉంటుందట.. అంతేకాదు వీటిని  ఎన్నాళ్ళు ఉపయోగించాలో కూడా  మీకు తెలుసా..?
ముఖ్యంగా అమ్మాయిల విషయానికి వస్తే,  వారు ఏదైనా ట్రెండీగా కోరుకోవడమే కాకుండా రకరకాలుగా సందర్భాన్ని బట్టి కూడా మారుస్తూ ఉంటారు. ఇక అబ్బాయిల విషయానికి వస్తే,  కేవలం ఒక జత లేదా రెండు జతలను మాత్రమే ..సంవత్సరం అంతా వాడుతూ ఉంటారు. మరి కొంతమందికి నచ్చడం లేదా ఆర్థికంగా ఇబ్బందులు ఉండటం వంటి కారణాల చేత ఎన్ని సంవత్సరాలు అయినా సరే,  అవి అరిగి పోకుండా ఉంటే , వాటిని పదే పదే వాడుతూ ఉంటారు.. కానీ ఇది అస్సలు మంచిది కాదంటున్నారు నిపుణులు.
షూస్ అయినా, చెప్పు లైన ఏవైనా సరే ఆరు నెలలకు మించి వాడకూడదు. ఒకవేళ అలా వాడటం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని వారు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే చెప్పులు , షూస్, సాక్స్ పాతబడే కొద్ది వాటిలో ఒక రకమైన ఫంగస్ ఏర్పడుతుందని , ఇది బాక్టీరియా , సూక్ష్మక్రిములు పెరిగేలా చేస్తుంది. ఇక సమయం పెరుగుతున్న కొద్దీ ఈ వైరస్ వృద్ధి కూడా పెరుగుతుంది. తద్వారా ఈ బ్యాక్టీరియా మన కాళ్ళ  ద్వారా శరీరంలోకి ప్రవేశించి,  అనేక రకాల ఇన్ఫెక్షన్ లు, అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది. ఈ సమస్యలను మనం తగ్గించుకోవడం కోసం ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సి ఉంటుంది. ఫలితంగా ఆర్థిక నష్టం కూడా తలెత్తుతుంది. కాబట్టి 6 నెలలకు మించి చెప్పులను, షూస్ ను  ఉపయోగించవద్దు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: