విశాఖ జిల్లా బలపం కాఫీ తోటల వివాదం పోలీసులకు సవాలుగా మారింది. ఎపిఎఫ్డిసి అధ్వర్యంలో ఉన్న ఈ తోటలను తమకు కేటాయించాలని గిరిజనులు కోరుతున్నారు. వీరికి మావోయిస్టులు కూడా మద్దతూ ఇస్తున్నారు. గూడెం కొత్తవీధీ మండలం, ఆర్వీ నగర్, ఎపిఎఫ్డీసీ పరిధిలో మర్రిపాకలు ఎస్టేట్ కు చెందిన 64 హెక్టార్ల కాఫీ తోటలను ఐదేళ్ల క్రితం. చింతపల్లి పరిధిలోని 100 హెక్టార్ల కాఫీ తోటలను రెండేళ్ల క్రితం మావోయిస్టులు గిరిజనలకు పంపిణీ చేశారు. కాఫీ సిబ్బింది నివాస గృహాలను ధ్వసం చేశారు. తాము పంపిణీ చేసిన తోటల జోలికి వస్తే సహించేది లేదని హెచ్చరించారు. మావోయిస్టుల చర్యలతో కాఫీ బోర్టు భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది కాఫీ తోటల పంపకాన్ని సవాలుగా తీసుకున్న పోలీసులు 95 మంది గిరిజనులపై కేసులు నమోదు చేశారు. వీరంతా స్వచ్ఛంధంగా లొంగిపోవాలని, లేకుంటే అరెస్టు చేయడానికివస్తే వందలాది మంది గిరిజనులు వారిపై దాడికి ప్రయత్నిస్తున్నారు. దీనితో బలపం కాఫీ తోటల వివాదం పోలీసులకు పెను సవాలుగా మారింది.
మరింత సమాచారం తెలుసుకోండి: