చిత్తూరు కాంగ్రెస్ లో ముఖ్యమంత్రి కిరణ్ పై తీవ్ర అసంతృప్తి

Durga
 చిత్తూరు జిల్లా కాంగ్రెస్ నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు ఆమె సన్నిహితులు చెబుతున్నారు. వైఎస్ హయాంలో జిల్లాలో ఆమె హవా నడిచింది. కిరణ్ సిఎం అయ్యాక సొంత జిల్లాలో ఆమె ప్రభావానికి బ్రేకులు పడ్డాయి, చంద్రగిరి నియోజకవర్గం తప్ప మిగిలిన వ్యవహారాల్లో ఆమె మాటకు విలువ లేకుండా పోయింది. ఈ పరిణామాలు అరుణకుమారి మద్దతుదారుల్లో ఆగ్రహం తెప్పించాయి. ఆమె కూడా లోలోన తీవ్రంగా మదనపడిపోతున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ కారణాలవల్లే ఆమె వేరుగా హైకమాండ్తో సంబంధాలు కొనసాగించే ప్రయత్నాలు ప్రారంభించారు. పలమనేరు కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జీగా వ్యవహరిస్తున్న ఎమ్మెల్సీ రెడ్డప్ప రెడ్డి ఇతర సామాజిక వర్గాల వారిని చులకన చేస్తున్నారంటూ మాజీ ఎమ్మెల్యే తిప్పేస్వామి ఇటీవల బహిరంగ యుద్దానికి దిగారు. సిఎం అండదండలతోనే ఎమ్మెల్సీ ఇలా వ్యవహరిస్తున్నారంటూ పిసిసి అధ్యక్షులు బొత్స దగ్గరకు పంచాయితీ తీసుకువెళ్లారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి సమయం దొరికితే సిఎంను దెబ్బతీయడానికి కాసుక్కూర్చున్నారు. తిరపతిలో అయితే పదవుల పంపకం ప్రతిపాదనల విషయంలో అనేకమంది నేతలు సిఎంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. నగరి నియోజకవర్గ నేత ఆర్.చెంగారెడ్డి కొంతకాలంగా జిల్లాపార్టీ వ్యవహారాలతో పట్టీపట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. పార్టీకి సంబంధించిన కొన్ని వ్యవహారాల్లో సిఎం తన అభిష్టాన్ని గౌరవించడంలేదని ఆగ్రహంతో ఆయన ఇలా ఉన్నట్లు తెలుస్తోంది. కిరణ్ కుమార్ రెడ్డి చేతిలో అధికారం ఉండటంతో ఇప్పటికిప్పుడు బైటపడి అసమ్మతిగళం విప్పడం వల్ల ఏమాత్రం ప్రయోజనం ఉండదనే అభిప్రాయంతో అందరూ వేచి చూసే ధోరణిలో ఉన్నారు. నామినేటెడ్ పదవుల పంపకాలకు పచ్చెజెండా ఊపితే ఈ అసంతృప్తి గొంతులు అరుపులు పెంచె అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: