పాతగూటికి చేరుకోనున్న కృష్ణయాదవ్

Kuthuru Raji Reddy
ఒకే గూటి పక్షలు ఎప్పటికైనా అదే గూటికి చేరుతాయనే సామెత నాయకుల వైఖరితో అప్పుడప్పుడు గుర్తుకొస్తుంటుంది. గతంలో చంద్రబాబును కాదని బయటకు వెళ్లి ఆయనెంతా అన్నటువంటి దేవేందర్ గౌడ్ పార్టీనుండి బయటకు వెళ్లీ కొత్తపార్టీ పెట్టి, తర్వాత ఇతర పార్టీలోకి వెళ్లీ తిరిగి అదే టిడిపి గూటికి చేరుకోగా పెద్దిరెడ్డి కూడా అదే బాటలో పయనించాడు. కాగా మాజీమంత్రి క్రిష్ణయాదవ్ అలా కాదు స్టాంపుల కుంభకోణంలో ఇరుక్కున్నారని ఆయనపై ఆరోపణలు వచ్చిన క్షణమే కృష్ణయాదవ్ ను చంద్రబాబు ప్రక్కన బెట్టారు. తర్వాత యాదవ్ ఆయన బాధలేందో ఆయనపడిన తర్వాత తిరిగి టిడిపిలో చేరడం కోసం రంగం సిద్దం చేసుకున్నారు. తెలుగుదేశం పార్టీలో వెలుగువెలిగినటువంటి క్రిష్ణయాదవ్ టిడిపి నుండి బహిష్కరించబడిన తర్వాత ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటిచేసి ఓడిపోయినప్పటికిని తనకు నియోజకవర్గంలో కొంత బలం ఉందనే విధంగా ఓట్లు పడ్డాయి. రానున్న రోజుల్లో తన నియోజక వర్గం నుండి తిరిగి పోటీ చేసేందుకు గాను ముందు జాగ్రత్తగా టిడిపిలో చేరేందుకు రంగం సిద్దం చేసుకున్నారు. రంగారెడ్డి జిల్లాలో చంద్రబాబు యాత్ర కొనసాగుతుండగా అదే పాదయాత్ర సందర్భంగా తిరిగి చంద్రబాబు సమక్షంలో టిడిపిలో చేరేందుకు శనివారం నాడు ముహుర్తం పెట్టుకున్నాడు. ఎన్నికల సమయం నాటికి చేరితే టిక్కెట్ విషయంలో కొంత ఇబ్బంది ఉంటుందనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుగా పార్టీలో చేరి భవిష్యత్తు కోసం ప్రణాళికను తయారు చేసుకునేందుకు గాను యాదవ్ సిద్దపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: