నేడు నల్గొండలో స్పీకర్ పర్యటన

 హైదరాబాద్: రాష్ర్ట అసెంబ్లీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ ప్రజాహిత కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దశాబ్దాల తరబడిగా ప్లోరోసిస్ తో బాధపడుతున్న వారిని పరామర్శించి సమస్య పరిష్కరించడానికి అఖిలపక్ష నాయకులతో కలిసి నేడు,రేపు నల్గొండ జిల్లాలో పర్యటించనున్నారు. ప్లోరైడ్ ప్రభావిత ప్రాంతమైన నల్గొండ జిల్లాలో రెండు రోజులు పర్యటించనున్నారు. ఏళ్ల తరబడిగా నల్గొండ జిల్లాలోని పలు ప్రాంతాల ప్రజలు ఈ ప్లోరైడ్ తో బాధ పడుతున్నారు. ఎందరో దీనికి బలయ్యారు. తలాపున క్రిష్ణమ్మ పరవళ్లు తొక్కుతుంది. కానీ, ఈ జిల్లా వాసులు తాగడానికి గుక్కెడు నీళ్లు దొరకని దౌర్భాగ్యం. ఫలితంగా ఎందరో దీని బారిన పడ్డారు. పడుతున్నారు. ప్లోరోసిస్ జిల్లా ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తోంది. దీని బాధితులు లక్షల్లో ఉన్నారు. ప్లోరోసిస్ కు వ్యతిరేకంగా గల్లీ నుంచి ఢిల్లీ వరకు అనేక పోరాటాలు చేశారు. కానీ, పట్టించుకునే నాథుడే లేడు. జిల్లాకు చెందిన అన్ని రాజకీయ పార్టీల నాయకులు ఎన్నికలు వస్తే చాలు తామంటే తాము ఈ ప్లోరోసిస్ సమస్యను పరిష్కరించడానికి క్రుషి చేస్తామనీ వాగ్దానాలు చేస్తారు.  ఎన్నికలయ్యాక ఏ ఒక్క నాయకుడూ దీని గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. బాధితులు, పలు ప్రజా సంఘాలు ఈ సమస్య పరిష్కారం కోసం దశాబ్దాల తరబడిగా అలుపెరగని పోరాటాలు చేస్తున్నారు. ప్రభుత్వాలు స్పందించిన దాఖలాలు లేవు. నల్గొండ జిల్లాలో ఎందరో పేరు ప్రఖ్యాతలు గాంచిన లీడర్లు ఉన్నారు. ప్రస్తుతం కేంద్రంలో పెట్రోలియం శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్న జైపాల్ రెడ్డి కూడా గతంలో ఈ జిల్లా నుంచి గెలుపొందినవారే. కానీ, ఈ ప్లోరైడ్ బాధితులను ఆదుకోవడానికి ఏమైనా చేశారంటే సమాధానం వెతుక్కోవల్సిందే.  ప్రస్తుతం రాష్ర్ట అసెంబ్లీ స్పీకర్ గా పని చేస్తున్న నాదెండ్ల మనోహర్ నల్గొండ ప్లోరైడ్ పై ద్రుష్టిని మళ్లించారు. అఖిలపక్షం సభ్యులతో ప్లోరైడ్ ప్రాంతాల్లో రెండ్రోజులు పర్యటించనున్నారు. స్పీకర్ గా ఉంటూ ప్లోరైడ్ ప్రాంత బాధితుల సమస్యల పరిష్కారం కోసం పర్యటించడం అభినందించదగ్గ విషయమే. స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లాలో రెండ్రోజుల పాటు పర్యటించనున్న అఖిలపక్షంతోనైనా జిల్లాలో నెలకుని ఉన్న ప్లోరోసిస్ సమస్యకు కొంతయినా పరిష్కారం లభించాలనీ మనమూ కోరుకుందాం. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: