కోదండరామా…...

Kuthuru RajiReddy
మాట తూటకంటే ప్రమాదం.. ఒక్కసారి మాటజారితే తర్వాత ఎంత బాధపడిన ప్రయోజనం అంతగా ఉండకపోవచ్చు. అందుకే మాట ప్రయోగించేముందు వెనుకముందు చూసుకోవడం మంచిదని చెబుతుంటారు. గాయపడిన మనస్సు తిరిగి అతుక్కోవడం చాలా కష్టమైందిగా చెప్పవచ్చు. కర్రుకాలిచి వాతలు పెట్టడం, కడుపులో ఎలా పుట్టారనే కోదండరామ్ గీతారెడ్డిని అన్నటువంటి మాటలు కొంతమందికి బాధను కల్పించింది. దీంతో వివాదానికి దారితీసింది. తెలంగాణ జెఎసి చైర్మన్ కోదండరామ్ మూడు రోజులు క్రితం రాష్ట్ర మంత్రి గీతారెడ్డిపై విమర్శలు చేశారు. మామూలు విమర్శలు చేస్తే ఎవరు పట్టించుకోకపోయేవారు కాదుకావచ్చుగాని, బాధించేమాటలు అన్నాడని కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలతో పాటు దళిత సంఘాల నేతలు ఆందోళనకు దిగారు. కోదండరామ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాయి. కాగా బుధవారం నాడు ఎమ్మార్పీఎస్, దళిత సంఘాల ఆద్వర్యంలో తెలంగాణ జెఎసి కార్యాలయం ముందు ఆందోళనకు దిగడంతో కోదండరామ్ క్షమాపణ చెప్పారు. గతంనుండి ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి జెఎసి చైర్మన్ కోదండరామ్ మాటలు చాలా జాగత్తగా మాట్లాడుతారు. కాగా గీతారెడ్డి పై విమర్శలు ఎలా చేశారో గాని వివాదానికి దారితీసింది. కావాలని ఎవరిని బాధించే గుణం లేనటువంటి కోదండరామ్ మాట జారితే క్షమించాలని కోరారు. దీంతో ఎంత పెద్దవారికైనా కొన్ని సందర్భాల్లో మాటలు జారడం జరుగుతుందనేది కోదండరామ్ విషయంతో తెలిసిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: