సినిమా వాళ్లను వాడేసుకొంటు హరీష్ రావు!
స్వయంగా హరీష్ రావు చెప్పుకొచ్చాడు.
మరి టాలీవుడ్ వాళ్లు తెరాసను ఇలా వాడేసుకొంటున్నారనుకొంటే.. తెరాస వాళ్లు కూడా రివర్స్ లో సినిమా వాళ్లను వాడుకొంటున్నారు. ఈ విషయాన్ని స్వయంగా హరీష్ రావు చెప్పుకొచ్చాడు. రుద్రమదేవి సినిమా ఆడియోవిడుదల వేడుకకు హాజరు కావడం గురించి ఆయన మాట్లాడుతూ..తను కొన్ని షరతుల మీద ఆ సినిమా వేడుకకు హాజరయ్యానని హరీష్ రావు చెప్పాడు.
మిషన్ కాకతీయ కార్యక్రమానికి
రుద్రమదేవి సినిమా ఇంటర్వెల్ లో మిషన్ కాకతీయ కార్యక్రమానికి సంబంధించిన ప్రచార వీడియోలను ప్రదర్శిస్తామని అంటేనే తను సినిమా ఆడియో విడుదల వేడుకకు వస్తానని ఆ యూనిట్ కు స్పష్టం చేశానని హరీష్ రావు చెప్పాడు. వారు ఆ షరతుకు అంగీకరించారని. .దాంతో ఆ సినిమా ఆడియోవిడుదల వేడుకకు హాజరయ్యానని హరీష్ రావు వివరించాడు. మరి రుద్రమదేవి సినిమాకు వెళ్లిన వారికి మిషన్ కాకతీయ యాడ్స్ కనిపిస్తాయనమాట! మరి బాగానే ఉంది హరీష్ రావు వాడకం!