కిరణ్ ను బిజెపి నేతలు ఆహ్వానిస్తారా!

Chowdary Sirisha
మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి భారతీయ జనతా పార్టీలో చేరడానికి సుముఖుంగానే ఉన్నారట. అయితే ఆయన అందుకు ఒక షరతు పెడుతున్నారట. పార్టీ పెద్ద నేతల నుంచి ఆహ్వానం అందాలని,అది కూడా గౌరవప్రదమైన ఆఫర్ ఉండాలని ఆయన కోరుకుంటున్నారట. కిరణ్ కుమార్ రెడ్డి సన్నిహితుడు ఒకరు ఈ విషయం చెబుతున్నారు.అమెరికా నుంచి తిరిగి వచ్చిన కిరణ్ ప్రస్తుతం ఖాళీగానే ఉన్నారు.రాజకీయాలలోకి రావడానికి ఆయన వ్యతిరేకంగా లేరు.అలాగే బిజెపిలో చేరడానికి అయిష్టతగా లేరు.కాకపోతే ఎవరి ద్వారా,ఎలా చేరాలన్నదానిపై ఆయనకు ఇంకా క్లారిటీ రాలేదని అంటున్నారు.విభజనకు సంబంధించి జరిగిన పరిణామాలను ఆయన అధ్యయనం చేస్తున్నారట. అలాగే ఉదయం వేళ మార్నింగ్ వాక్ చేస్తూ గడుపుతున్న కిరణ్ ను బిజెపి నేతలు ఆహ్వానిస్తారా?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: