హైదరాబాద్@చంచల్ గూడ జైలు

డిల్లీలోని తీహర్ జైలు హైదరాబాద్ కు మారిందా లేక నగరంలో ఉన్న చంచల్ గూడ జైలు తీహర్ ఆ స్ధాయికి చేరుకుందా అన్న అనుమానం ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరికీ మెదులుతుంది. జాతీయ, అంతర్జాతీయ స్ధాయి నేరాలు,ఆర్థిక అవినీతి అక్రమాలతో సంబసధం ఉన్న వారందరూ ప్రముఖులతో సహ తీహర్ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. అదే స్ధాయిలో గడిచిన రెండు సంవత్సరాలుగా అలాంటి చట్ట వ్యదతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లు విచారణను ఎదుర్కొంటున్న రాష్ట్రానికి చెందిన ప్రముఖులు అనేక మంది చంచల్ గూడ జైలులో గడుపుతున్నారు. దాంతో గతంలో ఎన్నడూ లభించని ప్రాముఖ్యత, ప్రాధాన్యత, గుర్తింపు చంచల్గూడ జైలుకు ఈరోజు జాతీయస్ధాయిలో సైతం లభించింది. అయితే తీహర్ కంటే కూడా చంచల్గూడ జైలు ఎంతో పురాతనమైంది. ఈ జైలును నాటి ఆరవ నిజాం హయాంలో 1879లో 400 ఎకరాల స్ధలంలో నిర్మించారు. అయితే తీహర్ జైలు విషయానికొస్తే మందు అది పంజాబ్ రాష్ట్రం ఆధీనంలో కారాగారంగా ఉండేది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 1958లో తీహర్ గ్రామంలో పక్క జైలు నిర్మించడమైంది. తర్వాత 1966 ఢిల్లీ కేంద్రపాలిత ప్రభుత్వానికి పూర్తిస్ధాయిలో బదిలీ చేసి అప్పగించటమైంది. ఆ తర్వాత పెరుగుతున్న అవసరాల దృష్టి తీహర్ జైలులో 1984లో అదనంగా అనేక సౌకర్యాలను పెంచటమైంది. దీంతో ఈ నాడు తీహర్ జైలు ప్రపంచంలోనే అతి పెద్ద జైలు ప్రాంగణంలో ఒకటిగా గేర్తింపు పొదింది. చాల్స్ శోభారాజు నుంచి మొదలుకొని నేటి సురేశ్ కల్మాడీ వరకు తీహర్ సేవలందిస్తూ వస్తుంది. ఇక చంచల్ గూడ జైలు నాటి తెలంగాణ సాయుధ పోరాట యోధుల మఖ్దుంమొహినుద్దీన్, స్వామి నామానందతీర్ధ నుంచి మొదలు పెట్టి నేటి గాలి జనర్దన్ రెడ్డి,సత్యం రామలింగరాజు, వైఎస్.జగన్మోహన్ రెడ్డి వరకు ఈ జైలు సేవలందిస్తూ వస్తుంది. ఈ రకంగా తీహర్ జైలు తో సరిసమానంగా జాతీయస్ధాయిలో చంచల్ గూడ జైలు గుర్తింపు పొదుతుందంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజల గర్వించదగ్గ విషయమే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: