ప్రథమ పౌరుని ఎన్నిక – ప్రదాన కూటముల్లో చీలిక

ఏకత చాటే ప్రక్రియ....అభాసుపాలయ్యే దిశగా ప్రపంచానికి మన జాతి ఏకతను చాటి చెప్పే ప్రక్రియ, అంతర్గతంగా ఎన్ని విభేధాలున్నా... యావత్ భారతజాతి ఒక్కటే...అని మన సమైక్యతను విశ్వమంతటికి తెలిపే ఒక సదవకాశం, మనదేశ ప్రథమపౌరుడు రాష్ట్రపతిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం. రాజకీయాలకు అతీతుడు, దేశ ప్రజలంతా గర్వంగా ఆమోదించే ఉన్నతుడిని, ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు ఎంపిక చేసి మనదేశ ఉన్నతిని,గొప్పదనాన్ని చూపించాల్సింది పోయి దానిని రాజకీయం చేస్తూ దేశప్రతిష్ట అబాసుపాలయ్యే దిశగా మన పాలకులు వ్యవహరిస్తుండడం శోచనీయం. స్వర్ణోత్సవాలు పూర్తి చేసుకున్న స్వతంత్ర భారతావనిలో ఈ ఎన్నిక పార్టీల మద్య ఇలా వివాదాస్పదం కావడం ఇదే మొదటిసారి కావచ్చు.  రాష్ట్రపతి ఎన్నిక విషయంలో మొదట్లో పార్టీల భేధాప్రియాలు వచ్చినా చివరకు ఏకాభ్రిపాయానికి వచ్చి ఏకగ్రీవంగా ఎన్నుకుంటుండడం జరుగుతూ వస్తోంది. కాని ఈసారి ఆ అవకాశాలు కన్పించడం లేదు. ఈ ఎన్నిక విషయంలో ప్రధాన కూటములైన యుపిఏ,ఎన్డీఏ లలో చీలికలు వచ్చాయి. రాష్ట్రపతి ఎన్నిక విషయంలో ఇదే మంచి పరిణామం కాదని భావిస్తున్న తరుణంలో ఎన్న ఇబ్బందులు తలెత్తినాయ సిద్దాంతాలకు కట్టుబడి ఉండే కమ్యూనిష్టు పార్టీని కూడా రెండుగా చీలుస్తుండడం గమనార్హం. పశ్చిమబెంగాల్ కమ్యూనిష్టుపార్టీ ప్రణబ్ ముఖర్జీకి మద్దతును ప్రకటించగా,కేరళ కమ్యూనిష్టు పార్టీ దీనిని వ్యతిరేకించడంతో పాటు సంగ్మా వైపుకు మొగ్గు చూపడం రాజకీయంగా పెద్ద పరిణామంగా చెప్పుకోవచ్చు. ఈ ఎన్నిక దేశరాజకీయాల్లో పెను ప్రకంనలు సృష్టించడంతో పాటు, భారీ మార్పులు కూడా తెస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. యూపిఏ అభ్యర్థి ప్రణబ్ ను ఆకూటమిలోని ప్రధాన భాగస్వామి తృణమూల్ కాంగ్రేస్ అధినేత్రి మమతాబెనర్జీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అభ్యర్థిగా మాజి రాష్ట్రపతి అబ్దుల్ కలాంను మమత సూచించింది. ప్రణబ్ ను మార్చని పక్షంలో యూపిఏ నుంచి వైదొలగాలని మమత నిర్ణయించినట్లు సమాచారం. ఇప్పటికే కేంద్రమంత్రి వర్గంలోని తృణమూల్ కు చెందిన ఎనిమిది మంది మంత్రులు వారి మంత్రి పదవులకు రాజీనామాల లేఖలను వారి అధినేత్రి మమతబెనర్జీకి సమర్పించినట్లు సమాచారం. అలాగే ఎన్డీఏ కూటమిలోని శివసేనతో పాటు కొన్ని పక్షాలు ప్రణబ్ కు మద్దతు తెలుపుతుండగా ప్రధానపక్షం బిజేపి మాత్రం వ్యతిరేకిస్తోంది . ఇలా జాతీయస్థాయిలో ఈ ఎన్నిక ప్రక్రియ పూర్తయ్యే సరికి మరెన్నో పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి. మొత్తం మీద ప్రథమపౌరుని ఎన్నిక పరిణామాలు దేశ రాజకీయ రూపురేఖలను మార్చే అవకాశాలనే ఎక్కువగా సూచిస్థున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: